పడిపోతున్న ఫారెక్స్ నిల్వలు
దేశంలోని విదేశీ మారకపు నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గత నెల 26తో ముగిసిన వారం రోజుల్లో 3.007 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. దీంతో 561.046 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు పరిమితమయ్యాయి. అంతకుముందు వారంలోనూ 6.687 బిలియన్ డాలర్లకు
- క్షీణించిన మరో 3 బిలియన్ డాలర్లు
ముంబై, సెప్టెంబర్ 2: దేశంలోని విదేశీ మారకపు నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గత నెల 26తో ముగిసిన వారం రోజుల్లో 3.007 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. దీంతో 561.046 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు పరిమితమయ్యాయి. అంతకుముందు వారంలోనూ 6.687 బిలియన్ డాలర్లకు సమానమైన విదేశీ మారకం నిల్వలు కరిగిపోయిన విషయం తెలిసిందే. కాగా, విదేశీ నగదు ఆస్తుల్లో పతనం భారీగా ఉంటున్నదని శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలియజేసింది.
ఆగస్టు 26తో ముగిసిన వారంలో క్షీణించిన 3 బిలియన్ డాలర్లలో 2.571 బిలియన్ డాలర్లు విదేశీ నగదు ఆస్తులేనని చెప్పింది. ఇక బంగారం నిల్వలు సైతం 271 మిలియన్ డాలర్లు దిగజారాయి. 39.643 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారతీయ రిజర్వుల స్థాయి కూడా 10 మిలియన్ డాలర్లు పడిపోయి 4.926 బిలియన్ డాలర్లకు చేరింది.
పెరిగిన భారత్ విదేశీ రుణభారం
భారత్ విదేశీ రుణాలు 2022 మార్చితో ముగిసిన సంవత్సరంలో 8.2 శాతం పెరిగింది. ఇది 620.7 బిలియన్ డాలర్లకు చేరిందని శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అమెరికా డాలరు రూపేణా 53.2 శాతం రుణం ఉందని, రూపాయి డినామినేషనల్లో సమీకరించింది 31.2 శాతమని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. భారత్ విదేశీ రుణం జీడీపీలో 19.9 శాతం కాగా, ఈ రుణంతో పోలిస్తే విదేశీ కరెన్సీ రిజర్వులు కాస్త తక్కువగా 97.8 శాతంగా ఉన్నాయన్నది. ఏడాది క్రితం విదేశీ రిజర్వులకు సమానంగా (100.6 శాతం) విదేశీ రుణం ఉండేది.
17% పెరిగిన ప్రభుత్వ విదేశీ రుణం
మొత్తం విదేశీ రుణంలో దీర్ఘకాలిక రుణాలు 499.1 బిలియన్ డాలర్లు (80.4 శాతం)కాగా, స్వల్పకాలిక రుణం 19.6 శాతం.. 121.7 బిలియన్ డాలర్లుంది. స్వల్పకాలిక రుణాల్లో చాలావరకూ దిగుమతులకు ఫైనాన్స్ చేసే వ్యాపార రుణాలవంటివి. గత ఏడాదితో పోలిస్తే 2022 మార్చిలో ప్రభుత్వ విదేశీ రుణం 17.1 శాతం పెరిగి 130.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అదనంగా స్పెషల్ డ్రాయిం గ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) కేటాయించినందున ప్రభుత్వ విదేశీ రుణం పెరగడానికి కారణమని ఆర్థిక శాఖ రిపోర్ట్ పేర్కొంది. ప్రభుత్వేతర విదేశీ రుణం 6.1 శాతం వృద్ధితో 490 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్నారై డిపాజిట్లు, స్వల్పకాలిక వ్యాపార రుణాలు, విదేశీ వాణిజ్య రుణాలు- ప్రభుత్వేతర రుణాల్లో అధికభాగం ఈ మూడింటివే. ఎన్నారై డిపాజిట్లు 2 శాతం క్షీణించి 139 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- forex reserves
- India
- losing
- rapidly
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

