వచ్చే మార్చి ఆఖరే తుది గడువు

సీఎండీ, సీఈవో పదవులను త్వరగా విభజించాలి లిస్టెడ్ కంపెనీలకు సెబీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: చైర్మన్ లేదా చైర్పర్సన్, ఎండీ, సీఈవో పదవులను త్వరగా విభజించాలని స్టాక్ మార్కెట్ నమోదిత సంస్థలకు రెగ్యులేటర్ సెబీ సూచించింది. సీఎండీ, ఎండీ-సీఈవో పదవుల విభజనకు వచ్చే ఏడాది మార్చి 31 చివరి గడువని మంగళవారం గుర్తుచేసింది. కార్పొరేట్ గవర్నెన్స్‌పై వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెబీ చైర్మన్ అజయ్ త్యాగీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్థ ప్రమోటర్ల స్థానాన్ని బలహీనపర్చడమే పదవుల విభజన వెనుక ఉన్న అసలు ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగు పర్చడానికి మాత్రమేనని వెల్లడించారు. మార్కెట్ విలువ ప్రకారం టాప్-500 సంస్థల్లో సీఎండీ, సీఈవో పదవులు వేర్వేరు వ్యక్తుల చేతుల్లోనే ఉండాలంటూ ఏప్రిల్ 1, 2022ను గడువుగా సెబీ విధించింది. నిజానికి గతేడాది ఏప్రిల్ 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి రావాలి. కానీ పరిశ్రమ విజ్ఞప్తుల మధ్య రెండేండ్లు పొడిగించారు. కాగా, నిరుడు డిసెంబర్ నాటికి 53 శాతం కంపెనీలే ఈ నిబంధనను ఆచరణలో పెట్టాయని త్యాగీ ఈ సందర్భంగా తెలియజేశారు. చాలా కంపెనీల్లో సీఎండీ, లేదా ఎండీ, సీఈవో పదవులు కలిసిపోయి ఉంటున్నాయి. ఈ పదవుల్లో ఒక్కరే ఉంటున్నారు. అయితే దీనివల్ల పారదర్శకత లోపిస్తున్నదని సెబీ అంటున్నది. ఇదిలావుంటే బ్యాంకులు, బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్స్ వంటి సంస్థాగత మదుపరులు తమ క్లెయింట్లు, లబ్ధిదారులకు జవాబుదారీగా ఉండేలా పారదర్శక స్టేవర్డ్షిప్ కోడ్‌ను అనుసరించాలని సెబీ ఆదేశించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- cmd post
- sebi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

