Income Tax | ఆ వివరాలు ఇవ్వకపోతే రూ.10లక్షల జరిమానా.. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్నుశాఖ వార్నింగ్..!
Income Tax | ఆదాయపు పన్నుశాఖ పన్ను చెల్లింపుదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్లడించకుంటే రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆదివారం హెచ్చరిస్తూ.. కంప్లయన్స్ కం అవేర్నెస్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Income Tax | ఆదాయపు పన్నుశాఖ పన్ను చెల్లింపుదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్లడించకుంటే రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆదివారం హెచ్చరిస్తూ.. కంప్లయన్స్ కం అవేర్నెస్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని పన్ను చెల్లింపుదారులకు సూచించింది. భారతీయ పన్ను చెల్లింపుదారులు విదేశీ బ్యాంక్ ఖాతా, నగదు రూప బీమా, యాన్యుటీ కాంట్రాక్ట్, సంస్థ, వ్యాపారంలో ఆర్థిక భాగస్వామ్యం, రియల్ ఎస్టేట్, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీ వంటి ఏదైనా మూలధన ఆస్తి గురించి సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని ఆర్థిశాఖ పేర్కొంది.
పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం ‘పన్ను విధించదగ్గ పరిమితి కంటే తక్కువగా’ ఉన్నప్పటికీ తమ ఐటీఆర్‌లో విదేశీ ఆస్తి (FA), విదేశీ మూలధార ఆదాయం (FSI) షెడ్యూల్‌ని తప్పనిసరిగా పూరించాలని చెప్పింది. ఐటీఆర్‌లో విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని బహిర్గతం చేయని పక్షంలో రూ.10లక్షల జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. 2024-25కి సంబంధించి ఇప్పటికే ఐటీఆర్‌ను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు క్యాంపెయిన్‌లో భాగంగా సందేశాలు, ఈ-మెయిల్స్‌ను పంపనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) పేర్కొంది. ఐటీఆర్ (ఏవై 2024-25)లో విదేశీ ఆస్తుల వివరాలను ఇవ్వని వారికి గుర్తు చేయడమే ఈ ప్రచారం ఉద్దేశమని పేర్కొంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31గా గడువు నిర్ణయించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

