Meta Layoffs | మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. భారత్‌లోని టాప్ ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం
Meta Layoffs | ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా 6,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది.
Meta Layoffs | ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా 6,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రాం మేనేజ్మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్ సహా పలు విభాగాల్లోని ఉద్యోగులను తొలగించింది.
భారత్‌లో (Meta India) పనిచేస్తున్న పలువురు టాప్ ఉద్యోగులపై కూడా ఈ లేఆఫ్స్ ప్రభావం పడింది.
మెటా ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ పంత్, మీడియా భాగస్వామ్యాల డైరెక్టర్ సాకేత్ ఝా సౌరభ్, మెటా ఇండియా లీగల్ డైరెక్టర్ అమృతా ముఖర్జీతో సహా భారత్‌లోని కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు పదవీవిరమణ చేయాల్సిందిగా యాజయాన్యం కోరినట్లు తెలిసింది.
కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ఉద్యోగులను తీసివేయనున్నట్లు ఈ ఏడాది మార్చిలో సీఈఓ (CEO) మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల తొలగింపును ఏప్రిల్, మేలో రెండు విడతలగా చేపడతామని వెల్లడించారు. అందులోభాగంగానే ఏప్రిల్‌లో నాలుగు వేల మందిని ఇంటికి పంపిన మెటా.. మిగిలిన 6వేల మంది ఉద్యోగుల్ని తాజాగా తొలగించింది. కాగా, జాబ్ కోల్పోయిన ఉద్యోగులు లింక్డిన్ పోస్టుల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Alibaba | లేఆఫ్స్ వేళ అలీబాబా గుడ్ న్యూస్.. 15 వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు ప్రకటన
Woman | 17 ఏళ్ల క్రితం అపహరణకు గురైన యువతి.. నేడు ఢిల్లీలో ప్రత్యక్షం
Karnataka Cabinet | కొలిక్కి వచ్చిన కేబినెట్ కూర్పు.. రేపు ప్రమాణం చేయనున్న 24 మంది మంత్రులు..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

