First Republic Bank | సంక్షోభంలో మరో అమెరికన్ బ్యాంక్.. ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంక్ తర్వాత ఫస్ట్ రిపబ్లిక్ షేర్లు భారీగా పతనం
First Republic Bank | వారం రోజుల్లో ఇప్పటికే రెండు బ్యాంక్‌ల పతనాన్ని చూసిన అమెరికాలో మరో బ్యాంక్ సంక్షోభం అంచున ఉందని వార్తలు వెలువడుతున్నాయి. 14వ అతిపెద్దదైన ఫస్ట్ రిపబ్లికన్ బ్యాంక్ లిక్విడిటీ కొరతతో సతమతమవుతూ వివిధ మార్గాలను అన్వేషిస్తున్నదని సమాచారం.
First Republic Bank | న్యూయార్క్, మార్చి 16: వారం రోజుల్లో ఇప్పటికే రెండు బ్యాంక్‌ల పతనాన్ని చూసిన అమెరికాలో మరో బ్యాంక్ సంక్షోభం అంచున ఉందని వార్తలు వెలువడుతున్నాయి. 14వ అతిపెద్దదైన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ లిక్విడిటీ కొరతతో సతమతమవుతూ వివిధ మార్గాలను అన్వేషిస్తున్నదని సమాచారం. రెండు రోజుల క్రితమే ఈ బ్యాంక్‌ను రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, ఎస్ అండ్ పీలు డౌన్‌గ్రేడ్ చేశాయి. లిక్విడిటీ, ఫండింగ్ రిస్క్‌ల కారణంగా ఫస్ట్ రిపబ్లికన్ బ్యాంక్ రేటింగ్ ‘నెగిటివ్ వాచ్’లోకి డౌన్‌గ్రేడ్ అయ్యింది. పలు ప్రతికూల వార్తల నేపథ్యంలో వారంలోనే 70 శాతం పతనమైన ఫస్ట్ రిపబ్లికన్ షేరు గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 30 శాతం మేర నష్టపోయింది. 1985లో ప్రారంభమైన ఈ బ్యాంక్ వాణిజ్య బ్యాంకింగ్ సర్వీసులతో పాటు ఇన్వెస్ట్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసుల్ని సైతం నిర్వహిస్తున్నది.
70 బిలియన్ డాలర్ల నిధులు
లిక్విడిటీ కొరత నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం హుటాహుటిన ఫస్ట్ రిపబ్లికన్‌కు వివిధ వనరుల ద్వారా 70 బిలియన్ డాలర్ల నిధుల్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ అందుబాటులో ఉంచినట్లు మరో వార్త వెలువడింది. ఫెడ్ నుంచి లభించిన అదనపు బారోయింగ్ సదుపాయం, జేపీ మోర్గాన్ అందించిన నిధులతో ప్రస్తుతం బ్యాంక్ మనుగడ సాగిస్తున్నది. ఫస్ట్ రిపబ్లికన్ బ్యాంక్ డిపాజిట్లలో 70 శాతానికి ఇన్సూరెన్స్ లేదు. ఇటీవల సంక్షోభంలో కూరుకున్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌ల తర్వాత ఫస్ట్ రిపబ్లిక్‌కే ఇన్సూరెన్స్ లేని డిపాజిట్లు అధికంగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక నోట్లో తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

