హైదరాబాద్, సెప్టెంబర్ 15: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్(ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్) తెలంగాణలో ఏడు శాఖలు కలుపుకొని దేశవ్యాప్తంగా ఒకేసారి 30 శాఖలను ప్రారంభించింది. దీంతో మొత్తం శాఖలు 375కి చేరుకున్నా యి. రాష్ట్రంలో సంస్థ 10,715 కస్టమర్లకు రూ.2,440 కోట్ల గృహ రుణాలు మంజూరు చేసింది.