Child Labour in Hyundai | అలబామా యూనిట్లో చైల్డ్ లేబర్.. హ్యుండాయ్ ఏమన్నదంటే?!
Child Labour in Hyundai | అమెరికాలోని అలబామా యూనిట్లో బాల కార్మికులతో హ్యుండాయ్ మోటార్స్ పని చేయిస్తున్నదని ఆరోపణలు వచ్చాయి.
అమెరికాలోని అలబామా యూనిట్లో దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ సంస్థ బాల కార్మికులతో పని చేయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలబామాలోని మాంట్గోమెరీ సమీప అసెంబ్లింగ్ యూనిట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాల కార్మికులు పనులు నిర్వహిస్తున్నారని స్థానిక పోలీసులను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్థ ఓ వార్తా కథనం ప్రచురిచింది.
బాల కార్మికుల్లో ఒకరి వయస్సు కేవలం 12 ఏండ్లు మాత్రమేనని, ఇటీవలి వరకు స్మార్ట్ అలబామా ఎల్ఎల్సీలో పని చేశాడని హ్యుండాయ్ సన్నిహిత వర్గాలు తెలిపాయంటూ హ్యుండాయ్ పేర్కొంది. హ్యుండాయ్ అనుబంధ సంస్థే స్మార్ట్ అలబామా ఎల్ఎల్సీ యూనిట్. ఇది అత్యంత పాపులర్ కార్లు, ఎస్యూవీలను అమెరికాలో సరఫరా చేస్తుంది.
రాయిటర్స్ వార్తా కథనంపై హ్యుండాయ్ మోటార్స్ స్పందించింది. అలబామాలోని తమ అనుబంధ సంస్థల్లో బాల కార్మికులు పని చేస్తున్నట్లు తమకు సమాచారం లేదని తెలిపింది. ఇమ్మిగ్రెంట్ ఉద్యోగులుగా బాల కార్మికులు (12) పని చేస్తున్నారని పోలీసులు, ఫ్యాక్టరీ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై తమకు సమాచారం లేదని హ్యుండాయ్ అధికార ప్రతినిధి డానా వైట్ స్పష్టం చేశారు. స్మార్ట్ ఎల్ఎల్సీ కూడా తమకు తెలిసి బాల కార్మికులతో పని చేయించడం లేదని వివరణ ఇచ్చింది. స్థానిక చట్టాలకు లోబడి కార్మికులు, ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు స్మార్ట్ జనరల్ మేనేజర్ గ్యారీ స్పోర్ట్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Alabama
- Child labour
- hyundai
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

