క్రెటా శిఖలో అరుదైన రికార్డు.. అదేంటంటే?!
క్రెటా శిఖలో అరుదైన రికార్డు.. అదేంటంటే?! దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యూండాయ్ ఎస్యూవీ మోడల్ కారు క్రెటా అరుదైన మైలురాయిని దాటింది. కంపాక్ట్ ఎస్యూవీ...

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యూండాయ్ ఎస్యూవీ మోడల్ కారు క్రెటా అరుదైన మైలురాయిని దాటింది. కంపాక్ట్ ఎస్యూవీ క్యాటగిరీలో తిరుగులేని మోడల్‌గా నిలిచి ప్రజల మనస్సులు దోచుకున్నది.
ఈ మోడల్ కారు 2015లో విపణిలోకి విడుదలైంది. గత ఆరేండ్లలో ఆరు లక్షల కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది నుంచి కరోనా లాక్‌డౌన్‌తో ఆటోమొబైల్ విక్రయాలు మందకోడిగా సాగాయి. కానీ, క్రెటా మోడల్ కార్ల అమ్మకాల్లో ఏ మాత్రం తగ్గుదల కనిపించలేదు.
వాస్తవంగా గత ఎనిమిది నెలల్లోనే చివరి లక్ష కార్లను హ్యుండాయ్ విక్రయించింది. అత్యధికంగా ఇప్పటి వరకు డీజిల్ వేరియంట్ కార్లు 3,99,787 యూనిట్లు అమ్ముడయ్యాయి.
గతేడాది మార్చిలో సెకండ్ జనరేషన్ క్రెటా కారును ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బీఎస్-6 నిబంధనలు అమల్లోకి వచ్చాక ఈ కారు మూడు ఇంజిన్లలో అందుబాటులోకి వచ్చింది.
1.4 లీటర్ టర్బో పెట్రోల్, 1.5లీటర్ పెట్రోల్,1.5లీటర్ డీజిల్ ఇంజిన్లతో ఈ మోడల్ కారు లభిస్తుంది. ఇక ఐదు రకాల ట్రాన్స్మిషన్ ఆఫర్లను హ్యుండాయ్ తన కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.
గత 14 నెలల్లో 1,39,204 కార్లు అమ్ముడయ్యాయి. మొత్తం విక్రయాల్లో 20శాతం ఆటోమేటిక్ వేరియంట్‌వే కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో 10,60,750 ఎస్‌యూవీలను విక్రయించారు.
గతేడాదిలో అమ్ముడైన ఎస్‌యూవీల్లో 11 శాతం క్రెటా మోడల్ కార్లే. ఈ మోడల్ ఎగుమతులు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు హ్యుండాయ్ 2,21,626 క్రెటా మోడల్ కార్లను ఎగుమతి చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

