హైదరాబాద్ జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ విస్తరణ

- హైదరాబాద్ విమానాశ్రయంలో మరిన్ని రన్వేలు
- 3.4 కోట్లకు పెరగనున్న ప్రయాణికుల నిర్వహణా సామర్థ్యం
హైదరాబాద్, సిటీబ్యూరో, అక్టోబర్ 20: హైదరాబాద్ నుంచి విమానయాన గమ్యస్థానాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రణాళిక శరవేగంగా అమలు జరుగుతున్నది. ఈ ప్రణాళికలో భాగంగా టర్మినల్, ఎయిర్‌సైడ్ ప్రాంతాల్ని అభివృద్ధిపరుస్తున్నారు. ఈ విమానాశ్రయ నిర్వహణా సంస్థ జీఎమ్మార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎక్కువ విమానాల్ని నిలిపిఉంచేందుకు మరిన్ని ఎయిర్‌క్రాఫ్ట్ స్టాండ్ల్ని, విమానరాకపోకలకు మరిన్ని రన్‌వేలను నిర్మిస్తున్నట్లు తెలిపింది. తొలుత వార్షికంగా 1.2 కోట్ల మంది ప్రయాణికుల నిర్వహణా సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్… విస్తరణ తర్వాత 3.2 కోట్ల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే సామర్థ్యం నెలకొంటుందని జీఎమ్మార్ పేర్కొంది. వివరాలివీ…
- విస్తరణ తర్వాత ఎయిర్‌సైడ్‌లో బోయింగ్ 737-700, ఏ320 సైజ్ విమానాల్ని నిలపగల 93 కోడ్ సీ ఎయిర్‌క్రాఫ్ట్ స్టాండ్లు ఉంటాయి. వీటిలో 44 కాంటాక్ట్ స్టాండ్లు కాగా, 49 రిమోట్ స్టాండ్లు. వెస్ట్రన్ ఏప్రాన్‌లో అంతర్జాతీయ కార్యకలాపాల కోసం అదనంగా 17 కాంటాక్ట్ స్టాండ్లు, ఒక రిమోట్ స్టాండ్ నెలకొంటాయి. దేశీయ విమానాల రాకపోకలు సాగించే ఈస్ట్రన్ ఏప్రాన్‌లో అదనంగా 17 కాంటాక్ట్ స్టాండ్లు, 4 రిమోట్ స్టాండ్లు ఏర్పాటవుతాయి.
- రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు ఇటీవల కొత్తగా నాలుగు ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలను ప్రారంభించారు. ఈ ట్యాక్సీవేలతో విమానాలు తక్కువదూరంలోనే రన్‌వే నుంచి గాలిలోకి ఎగరగలుగుతాయి. తద్వారా రన్‌వే ఆక్యుపెన్సీ సమయం తగ్గి, రన్‌వే సామర్థ్యం మెరుగుపడుతుంది.
- సెకండరీ రన్‌వే ఉపయోగించేటపుడు కా ర్యకలాపాలు సజావుగా సాగేందుకు కొ త్తగా ఒక సమాంతర ట్యాక్సీవే నిర్మించారు.
- విమానాలు, గ్రౌండ్ సర్వీస్ వాహనాల రాకపోకల సమయంలో ప్రయాణికులు, బ్యాగేజీ సురక్షితంగా తరలిపోయేందుకు ఒక నూతన సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు.
- వర్షపు నీరు సాఫీగా ప్రవహించేందుకు వీలుగా 16 లక్షల చదరపు మీటర్ల ప్రాంతాన్ని చదును చేశారు. అలాగే వాన నీటిని నిల్వచేసి, తిరిగి శుద్దిచేసిన తర్వాత ఉపయోగించుకోవడానికి 450 ఎంఎల్డీ సామర్థ్యంగల రిజర్వాయర్‌ను నిర్మించారు.
- ఇండియాలోనే పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని కల్గిస్తున్న ఏకైక విమానాశ్రయం అయిన ఆర్జీఐఏ… ఇప్పుడు కృత్రిమ మేథతో పనిచేసే అడ్వాన్స్డ్ క్యూ మేనేజ్మెంట్ సొల్యూషన్లను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఈ సొల్యూషన్స్ ద్వారా ప్రయాణికులు వేచి ఉండాల్సిన సమయం తెలుస్తుంది. సామాజిక దూరా న్ని పాటించడాన్ని పర్యవేక్షిస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో ప్రయాణికుల గణాంకాల్ని సరిగ్గా అంచనావేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

