హైదరాబాద్, డిసెంబర్ 5: గ్రాన్యూల్స్కు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి అనుమతినిచ్చింది. ఊపిరితిత్తుల ధమనుల్లో వచ్చే రక్తపోటును నియంత్రంచే టానిక్ సిడెనాఫీకి అక్కడి మార్కెట్లో విక్రయించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చినట్టు పేర్కొంది.
ఈ ఔషధాన్ని అక్కడి మార్కెట్లో గ్రాన్యూల్స్కు చెందిన సబ్సిడరీ సంస్థ ఉత్పత్తి చేసి విక్రయించనున్నది. దీంతో ఇప్పటి వరకు 63 ఔషధాలకు అనుమతినిచ్చినట్టు అయింది.