Sovereign Gold Bonds | బంగారం అంటే భారతీయ మహిళలకు ఎంతో ఇష్టం.. ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన రిటర్న్స్ కోసం ఆలర్ట్నేటివ్ పెట్టుబడి మార్గం కూడా.. ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్లను నిరుత్సాహ పరిచేందుకు కేంద్రం 2015-16 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీం తీసుకొచ్చింది. ఆ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో దశ సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయిస్తోంది ఆర్బీఐ. ఈ నెల 11న మొదలైన ప్రక్రియ ఈనెల 15 వరకూ కొనసాగనున్నది.
గ్రామ్ బంగారం బాండ్ విలువ రూ.5923గా నిర్ణయించింది ఆర్బీఐ. ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి రూ.50 రాయితీతో రూ.5873లకే లభిస్తుంది. ఈ నెల ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు బంగారంపై ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ ధర ప్రకారం బంగారం బాండ్ విలువ ఖరారు చేసింది. ఆసక్తి గల ఇన్వెస్టర్లు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ద్వారా బాండ్లను కొనుగోలు చేయొచ్చు.. అదేలాగో చూద్దామా.. !
* ‘ఎస్బీఐ’ నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ కావాలి.
* మెయిన్ మెనూలో ‘ఈ-సర్వీస్’ పై క్లిక్ చేయాలి.
* ‘సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం’పై క్లిక్ చేయాలి.
* ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే మీ పేరు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. టర్మ్ అండ్ కండీషన్స్ ఆమోదించిన తర్వాత ‘ప్రొసీడ్’ ఆప్షన్ నొక్కాలి.
* మీ వ్యక్తిగత వివరాలు, నామినీ డిటైల్స్ నమోదు చేయాలి.
* మీ డీమ్యాట్ ఖాతా గల ఎన్ఎస్డీఎల్/ సీఎస్‌డీఎల్ ను ఎంచుకోవాలి.
* డీపీ ఐడీ, క్లయింట్ ఐడీ నమోదు చేసిన తర్వాత ‘సబ్మిట్’ టాబ్ క్లిక్ చేయాలి
* డిటైల్స్ కన్ ఫర్మ్ చేసి.. సబ్మిట్ టాబ్ క్లిక్ చేయాలి.
‘సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం’పై క్లిక్ చేసి.. హెడర్ ట్యాబ్ నుంచి ‘పర్చేజ్’ సెలెక్ట్ చేసుకోవాలి.
* టర్మ్స్ అండ్ కండీషన్స్ టాబ్ సెలెక్ట్ చేసిన తర్వాత ‘ప్రొసీడ్’ టాబ్ క్లిక్ చేయాలి
* ‘సబ్స్క్రిప్షన్ క్వాంటిటీ’, నామినీ డిటైల్స్ నమోదు చేయాలి.. అటుపై ‘సబ్మిట్’ మీద క్లిక్ చేయాలి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి ‘కన్ఫర్మ్’ క్లిక్ చేయాలి
అప్పుడు కొత్త పేజీలో మీ ఎస్జీబీ ఇన్వెస్ట్ మెంట్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
* మీ క్రెడెన్షియల్స్‌తో ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్’లో లాగిన్ కావాలి.
* ‘ఇన్వెస్ట్, ఇన్సూర్’ సెలెక్ట్’ చేసుకోవాలి. అటుపై * ‘సావరిన్ గోల్డ్ బాండ్’పై సెలెక్ట్ చేయాలి. నాలుగో దశలో పేమెంట్ చేస్తే సరి.
* మీ హెచ్డీఎఫ్సీ నెట్ బ్యాంకింగ్’లో లాగిన్ కావాలి.
* మెనూ బార్’లోకి వెళ్లి ‘ఆఫర్స్’ టాబ్ పై క్లిక్ చేయాలి.
* ‘ఎస్జీబీ’ బ్యానర్‌పై ‘బై నౌ’ ఆప్షన్ క్లిక్ చేయాలి (మీరు యాక్టివ్ ఎస్జీబీ సబ్ స్క్రైబర్ కాకుటే ఎస్జీబీ బ్యానర్ కనిపించదు).. అప్పుడు పాప్ అప్ మెసేజ్ మీద ఓకే అని నమోదు చేసి క్లిక్ చేయాలి.
* మీ ఎస్జీబీ బాండ్ పొందాలంటే.. మీ డీమ్యాట్ ఖాతా వివరాలు తప్పనిసరిగా యాక్టివేట్ చేసేందుకు మరో పాపప్ మెసేజ్ వస్తుంది. దానిపై ఓకే అని క్లిక్ చేయాలి.
* కస్టమర్ ఐడీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, పాన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి.
* మీరు ఎన్ని యూనిట్ల బాండ్లు కొనుగోలు చేయ తలపెట్టారో ఆ వివరాలు, నామినీ వివరాలు నమోదు చేయాలి.
* ‘నేను నిబంధనలు, షరతులు అన్ని చదివి అర్థం చేసుకున్నాను` అని ఉన్న బాక్స్ మీద క్లిక్ చేసి.. జనరేట్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయాలి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
అప్పుడు మీకు ఎస్జీబీ బాండ్ రీడింప్షన్ ప్రైస్ వస్తుంది.
* కెనరా బ్యాంక్ నెట్ బ్యాంకింగ్‌లో క్రెడెన్షియల్స్ నమోదు చేసి లాగిన్ కావాలి.
* సర్వీసుల కింద గల అదర్స్ టాబ్స్‌లో ‘అప్లయ్ ఫర్ ఎస్జీబీ’ మీద క్లిక్ చేయాలి.
* ‘సబ్‌స్క్రైబ్’ క్లిక్ చేసి, డిటైల్స్ సెలక్ట్ చేసి డౌన్ లోకి వెళ్లి.. మీరు కొనుగోలు చేయతలపెట్టిన బాండ్ల యూనిట్లు, వాటి విలువ నమోదు చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
* మీరు నమోదు చేసిన వివరాలు వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
* మీ క్రెడెన్సియల్స్ ఉపయోగించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ కావాలి.
* అదర్ సర్వీసుల విభాగంలో ‘పర్చేజ్ ఎస్జీబీ’ మీద క్లిక్ చేయాలి.
* టర్మ్స్ అండ్ కండీషన్స్’ను అంగీకరిస్తున్నట్లు టాబ్ మీద క్లిక్ చేయాలి.
* కస్టమర్ ఐడీ, ఖాతా నంబర్, ఇతర వివరాలు నమోదు చేసి ‘ఓకే’ క్లిక్ అనాలి.
* మీరు కొనుగోలు చేయతలపెట్టిన బంగారం యూనిట్లు నమోదు చేసి, డిపాజిటరీ సంస్థ పేరు ఎంటర్ చేసిన ‘కంటిన్యూ’ ఆప్షన్ క్లిక్ చేయాలి.
* ట్రాన్సాక్షన్ పాస్ వర్డ్ నమోదు చేసి సబ్మిట్ ‘క్లిక్’ చేయాలి.
* మీరు నమోదు చేసిన వివరాలు వెరిఫై చేసుకున్న తర్వాత ‘ఓకే’ టాబ్ మీద క్లిక్ చేయాలి. మీకు ఎక్నాలెడ్జ్మెంట్ రశీదు వస్తుంది.