Home Loan Tax Benifits | ఇల్లు కొనాలనుకుంటున్నారా.. లోన్ తీసుకుంటే ఈ బెనిఫిట్స్ పొందొచ్చు
Home Loan Tax Benifits | రుణంపై ఇల్లు కొనుగోలుతో ఐటీ మినహాయింపుతోపాటు టాపప్ లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ వంటి బెనిఫిట్లు పొందొచ్చు.
Home Loan Tax Benifits | సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. రోజువారీ కుటుంబ ఖర్చులు భరిస్తూనే సొంతింటిని కట్టుకోవాలంటే ఇంటి రుణమే పరిష్కార మార్గం. ఇలా ఇంటి రుణం తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా రుణ వాయిదాలు చెల్లించాల్సి వచ్చినా ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిసారి హోంలోన్ తీసుకున్న వారికి లభించే బెనిఫిట్స్ తెలుసుకుందామా..!
హోంలోన్‌పై ఐటీ చట్టం 24 (బీ) సెక్షన్ కింద రూ.2 లక్షలు, 80సీ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపుపై పన్ను మినహాయింపులభిస్తుంది. అంటే మొత్తం రూ.3.50లక్షల వరకు ఐటీ కింద మినహాయింపు క్లయిమ్ చేసుకోవచ్చు.
రుణ గ్రహీతతో కో-అప్లికెంట్ ఉండటం వల్ల ప్రయోజనాలున్నాయి. లోన్ భారంగా కాకుండా కో-అప్లికెంట్‌ను జత చేసుకుంటే కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. ఎక్కువ పరిమాణంలో లోన్ పొందడంతోపాటు ఇరువురు పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఆర్థిక సమస్యలు చుట్టుముడితే రుణ వాయిదా చెల్లింపులో ఇబ్బందులు తలెత్తవు. భార్యను కో-అప్లికెంట్‌గా చేసుకోవడం వల్ల బెనిఫిట్లు లభిస్తాయి. మహిళ కో-అప్లికెంట్‌గా ఉన్నందున తక్కువ వడ్డీరేట్కు రుణం మంజూరవుతుంది.
ఇంటిరుణం తీసుకున్న తర్వాత అత్యవసర పరిస్థితులు తలెత్తితే టాపప్ రుణం కూడా పొందొచ్చు. ప్రత్యేకించి పిల్లల చదువులు, హాస్పిటల్ బిల్లులకు ఉపయోగపడుతుంది టాపప్ లోన్. ఇతర మార్గాల్లో తీసుకునే రుణం కంటే టాపప్ లోన్‌పై వడ్డీరేటు కూడా తక్కువే.
తరుచుగా డబ్బు అవసరమైన వారు ఇంటి రుణంపై ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీని కూడా పొందొచ్చు. గడువు తీరే లోపు వడ్డీలేకుండా ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం చెల్లించొచ్చు. ఇంటి రుణ వాయిదా చెల్లింపునకు కూడా ఈ ఓడీ మొత్తం వాడుకోవచ్చు. తద్వారా అధిక రుణ భారం తప్పించుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

