Hindenburg | అదానీ గ్రూప్ షెల్ కంపెనీల్లో సెబీ చైర్‌పర్సన్‌కు రహస్య వాటాలు.. హిండెన్ మరో బాంబ్
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం మరో బాంబు పేల్చింది. ‘సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని ఎక్స్‌లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే సంచలన ఆరోపణలు చేసింది.
- సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై సంచలన ఆరోపణలు
- భర్తతో కలిసి పెట్టుబడులు పెట్టారంటూ డాక్యుమెంట్ విడుదల
- స్వలాభంతోనే అదానీ కేసు పక్కదారి పట్టించారని విమర్శలు
Hindenburg | న్యూఢిల్లీ, ఆగస్టు 10: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం మరో బాంబు పేల్చింది. ‘సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని ఎక్స్‌లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే సంచలన ఆరోపణలు చేసింది. ఏకంగా భారత స్టాక్ మార్కెట్ల నియంత్రణ మండలి సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్ లక్ష్యంగా ప్రధాన ఆరోపణలు గుప్పించింది మరి.
గతంలో తాము బయటపెట్టిన అదానీ గ్రూప్ కుంభకోణానికి కొనసాగింపుగా.. గౌతమ్ అదానీకి చెందిన విదేశీ డొల్ల కంపెనీల్లో ఆమెకు, ఆమె భర్తకు వాటాలున్నట్టు పేర్కొన్నది. అందుకే అదానీపై పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించడానికి పూరీ ఆశ్చర్యకర రీతిలో ఆసక్తి కనబర్చారని కూడా చెప్పింది. నిజానికి నియంత్రణ పరమైన నిర్ణయాలు కంపెనీకి అనుకూలంగా తీసుకుంటారని తాము ముందే గుర్తించినట్టు తెలిపింది. ప్రస్తుతం పురి, ఆమె భర్త ధవల్ బచ్‌కు బెర్ముడా, మారిషస్‌ల్లోని ఫండ్లలో రహస్య వాటాలున్నట్టు హిండెన్‌బర్గ్ ఆరోపిస్తున్నది.
జూన్ 5, 2015లో సింగపూర్‌లో ఐపీఈ ప్లస్ ఫండ్ కోసం అక్కడి బ్యాంకులో ఖాతాను తెరిచారని ఓ విజిల్ బ్లోయర్ డాక్యుమెంట్లో పేర్కొంది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నిర్వహిస్తున్న సంస్థల నుంచి 10 మిలియన్ డాలర్ల నిధులు మళ్లింపు జరిగిందనీ ఆరోపిస్తున్నది. ఈ నిధులు సెబీ చైర్పర్సన్ సింగపూర్ ఖాతాలోకి బదిలీ అయ్యాయని అంటుండటం గమనార్హం.
మళ్లీ అదానీపైనే..
గత ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్.. 18 నెలల తర్వాత మళ్లీ అదే గ్రూప్ లక్ష్యంగా మరో బాంబు పేల్చింది. అదానీ గ్రూపు కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ నాడు చేసిన ఆరోపణలతో అదానీ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. హిండెన్ బర్గ్ నివేదికను తప్పుబట్టడంతోపాటు దేశీయ మార్కెట్లను అస్థిర పరచడానికి జరిగిన ప్రయత్నంగా కొట్టిపారేసింది. హిండెన్‌బర్గ్.. తమ నివేదికను కొన్ని కంపెనీలతో పంచుకొని తద్వారా వచ్చిన లాభాల్లో వాటాలు తీసుకున్నదని ఆరోపించింది. అంతేగాక నిబంధనల ఉల్లంఘనల కింద 2 నెలల క్రితం నోటీసులనూ జారీ చేసింది. అయితే వీటిని హిండెన్‌బర్గ్ తేలిగ్గానే తీసుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

