Hindenburg | హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్ నోటీసు..! అర్థం లేనిదన్న రీసెర్చ్ సంస్థ..!
Hindenburg | అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి వార్తలకెక్కింది. ఈ నెల 27న సెబీ (SEBI) షోకాజ్ నోటీసులు జారీ చేసిందని పేర్కొంది.
Hindenburg | అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి వార్తలకెక్కింది. ఈ నెల 27న సెబీ (SEBI) షోకాజ్ నోటీసులు జారీ చేసిందని పేర్కొంది. భారతీయ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ భారతీయ రెగ్యులేటరి నోటీసులు జారీ చేసిందని చెప్పింది. సెబీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంలో అర్థంలేనిదంటూ న్యూయార్క్‌కు చెందిన కంపెనీ కొట్టిపడేసింది. భాతర్లోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు చేసిన అవినీతి, మోసాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తే భయపెట్టే ప్రయత్నమంటూ విమర్శించింది.
అదానీ గ్రూప్ అవకతవకలను బయటపెట్టిన సందర్భంలోనే.. కంపెనీకి సంబంధించిన స్టాక్స్‌ను షార్ట్ చేసినట్లు పేర్కొంది. అదానీ షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి వాటిపై ట్రేడ్ చేసినట్లు వెల్లడించింది. సెబీ షోకాజ్ నోటీసుకు ప్రతిస్పందిస్తూ.. ఇక ఈ ఎపిసోడ్లో సెబీ షోకాజ్ నోటీసుకు ప్రతిస్పందిస్తూ కోటక్ మహీంద్రా బ్యాంక్ పేరును ప్రస్తావించింది. ఆ బ్యాంకు అదానీ గ్రూప్ అవకతవకల వ్యవహారం వెలుగు చూసే సమయంలో ఆఫ్‌షోర్ ఫండ్ ఏర్పాటు చేసిందని తెలిపింది. దాని సహాయంతో ఓ పెట్టుబడి భాగస్వామి ద్వారా అదానీ స్టాక్‌ను ష్టార్ చేశారని.. దాంతో కోటక్ బ్యాంకుకు లాభాలు ఏమీ రాలేదని.. సెబీ జారీ చేసిన నోటీసుల్లో ఎక్కడా కోటక్ పేరు, బోర్డు సభ్యుల పేర్లు ప్రస్తావించలేదని పేర్కొంది.
సెబీ మరో శక్తివంతమైన భారత వ్యాపారవేత్తను కాపాడే యోచనలో ఉందని స్పష్టమవుతోందని ఆరోపించింది. అదానీ షేర్ల ష్టార్ సెల్లింగ్‌లో నిబంధనలు పాటించామని స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లతో ఉన్న సంబంధాలతో ష్టార్ చేసి 4.1 మిలియన్ డాలర్ల ఆదాయం పొందామని.. అయితే, సంస్థ ఖర్చులు, మిగతా వ్యయాలను లెక్కిస్తే తమకు ఏం మిగలలేదని చెప్పింది. అవినీతి అక్రమాలను బయటపెట్టిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత కూడీ ఈ కేసులో వాస్తవాలను గుర్తించడంలో సెబీ విఫలమైందని హిండెన్‌బర్గ్ విమర్శించింది. ఇదిలా ఉండగా.. 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ స్టాక్స్ ధరను కృత్రిమంగా పెంచిందని.. విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుందని ఆరోపించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

