CNG Car’s Demand | సీఎన్జీ కార్లకు ఫుల్ గిరాకీ.. 97% గ్రోత్.. ఎందుకంటే?!
CNG Car's Demand | పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎన్జీ వేరియంట్ కార్ల కొనుగులుకు ప్రియారిటీ ఎక్కువైంది.

CNG Car’s Demand | కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకించి వ్యక్తిగతంగా కార్లు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా కార్ల కొనుగోళ్లు పెరిగాయి. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోవడంతో ఏ వేరియంట్ కారు కొనాలన్న విషయమై వినియోగదారులు మీమాంసలోపడుతున్నారు. అయితే సీఎన్జీ మోడల్ కార్లను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో సీఎన్జీ వేరియంట్ కార్లు.. వాహనాలంటే డిమాండ్ పెరిగిపోయింది. వివిధ కార్ల తయారీ సంస్థలకు చెందిన 11 మోడల్స్ సీఎన్జీ కార్లు లక్షకు పైగా అమ్ముడయ్యాయి.
2020-21తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సీఎన్జీ కార్లకు 97 శాతం గిరాకీ పెరిగింది. గతేడాది 51,448 సీఎన్జీ వెహికల్స్ అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 1,01,412 కార్లు అమ్ముడు పోయాయి. వార్షిక ప్రాతిపదికన 49,964 సీఎన్జీ కార్లు, వెహికల్స్‌ను కస్టమర్లు కొనుగోలు చేశారు. అయితే, నిరంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడం వల్లే సీఎన్జీ కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
సీఎన్జీ కార్ల విక్రయంలో మారుతి, హ్యుండాయ్ ముందు వరుసలో నిలిచాయి. ప్రత్యేకించి పలు మారుతి మోడల్ కార్లు సీఎన్జీ వేరియంట్లలో లభ్యం అవుతున్నందు వల్లే ఆ సంస్థ కార్లే ఎక్కువగా అమ్ముడు అవుతున్నాయి. మారుతిలో ఏడు మోడల్స్, హ్యుండాయ్‌లో నాలుగు మోడల్ కార్లకు ఎక్కువ గిరాకీ ఉంది. మారుతి కార్లలో వ్యాగన్ఆర్ సీఎన్జీ మోడల్ కార్లు గత ఆరు నెలల్లో 34,913 యూనిట్లు అమ్ముడు పోయాయి. గతేడాది కేవలం 16,167 కార్లు మాత్రమే విక్రయించింది. దీంతో పోలిస్తే ఈ ఏడాది 116 శాతం గ్రోత్ నమోదైంది.
అత్యధికంగా అమ్ముడు పోయిన టాప్-5 సీఎన్జీ కార్లలో మూడు మారుతి మోడల్స్, రెండు హ్యుండాయ్ మోడల్స్ నిలిచాయి. మారుతి వ్యాగన్ఆర్, ఎర్టిగా, ఈకో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. హ్యుండాయ్ ఔరా, గ్రాండ్ ఐ 10.. నాలుగు, ఐదుస్థానాల్లో నిలిచాయి.
ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.50. ముంబైలో రూ.58. మరోవైపు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 103.97, లీటర్ డీఇజల్ రూ.86.87లకు లభిస్తుంది. దీని ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరల కంటే సీఎన్జీ గ్యాస్ దాదాపు సగం ధరకే లభిస్తుంది.
సీఎన్జీ కార్లలో ఎక్కువ మైలేజీ లభిస్తుంది. మారుతి వ్యాగన్ఆర్ కారు ఒక కిలో సీఎన్జీ గ్యాస్‌పై 32.52 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. పెట్రోల్ మోడల్ కార్లలో లీటర్ పెట్రోల్‌పై మైలేజీ 21.79 కి.మీ. వస్తుంది. అంటే పెట్రోల్ కంటే సీఎన్జీ గ్యాస్ మోడల్ కారు మైలేజీలో 10 కిలోమీటర్ల తేడాది ఉంది.
డీజిల్ మోడల్ ధరలు సమానం
పెట్రోల్ మోడల్ కారుతో పోలిస్తే డీజిల్ మోడల్ కారుపై రూ.లక్ష అదనం. డీజిల్ వేరియంట్ కంటే సీఎన్జీమోడల్ కారు ధర తక్కువ. ఉదాహరణకు హ్యుండాయ్ ఔరా కారు డీజిల్ మోడల్ ధర రూ.7.91 లక్షలు. అదే సీఎన్జీ మోడల్ కారు ధర రూ.7.67 లక్షలకు లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

