PAN Card | మీ పాన్ కార్డు పనిచేస్తుందా? ఆధార్‌తో లింక్ చేయలేదని ఇన్‌యాక్టివ్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి
PAN Card | మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే తొందరగా రెండింటినీ అనుసంధానం చేసుకోండి. లేదంటే ఇకపై మీ పాన్ కార్డు పనిచేయకపోవచ్చు. ఇప్పటికే ఆధార్‌తో లింక్ చేయని చాలావరకు పాన్ కార్డులు ఇన్‌యాక్టివ్ అయ్యాయి. మరి మీ పాన్ కార్డు పనిచేస్తుందా? లేదా? తెలుసుకోండి.
PAN Card | మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే తొందరగా రెండింటినీ అనుసంధానం చేసుకోండి. లేదంటే ఇకపై మీ పాన్ కార్డు పనిచేయకపోవచ్చు. ఇప్పటికే ఆధార్‌తో లింక్ చేయని చాలావరకు పాన్ కార్డులు ఇన్‌యాక్టివ్ అయ్యాయి. మరి మీ పాన్ కార్డు పనిచేస్తుందా? లేదా? తెలుసుకోండి. ఇన్‌యాక్టివ్ అయితే వెంటనే పాన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేసుకోండి. పాన్ కార్డు పనిచేస్తుందా? లేదా? అనే విషయం ఎలా తెలుసుకోవాలని గందరగోళానికి గురికావాల్సిన అవసరమేమీ లేదు. సులువుగా ఇంట్లో కూర్చొనే ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు.
ఇదీ ప్రాసెస్..
☞ ఇందుకోసం ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయండి.
☞ ఆదాయపు పన్ను శాఖ ఇ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎడమ వైపు పైభాగంలో ఉన్న హోమ్ బటన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు కొన్ని క్విక్ లింక్స్ కనిపిస్తాయి.
☞ క్విక్ లింక్స్‌లో వెరిఫై యు పాన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
☞ అందులో పాన్, పూర్తి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి.
☞ అప్పుడు వెరిఫికేషన్ పేజి ఓపెన్ అవుతుంది. అందులో మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు మీ పాన్ కార్డు వాలిడ్ అవునో కాదో తెలుస్తుంది.
మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి..
☞ ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయండి.
☞ ఆదాయపు పన్ను శాఖ ఇ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎడమ వైపు పైభాగంలో ఉన్న హోమ్ బటన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు కొన్ని క్విక్ లింక్స్ కనిపిస్తాయి.
☞ క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పాన్ కార్డు, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి.. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
☞ అప్పుడు వెరిఫికేషన్ పేజి ఓపెన్ అవుతుంది. అందులో మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ అయ్యిందో లేదో తెలుస్తుంది.
ఇక్కడ కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది. అవేంటంటే.. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ 15 నిమిషాలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అలాగే సరైన ఓటీపీని ఎంటర్ చేయడానికి మూడు సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటీపీని ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

