HDFC Millennia Credit Card | మిలీనియల్స్‌కు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ `మిలీనియా క్రెడిట్ కార్డ్`.. ఇవీ ఆఫర్లు..!
HDFC Millennia Credit Card | మిలీనియల్స్ కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ `మిలీనియా క్రెడిట్ కార్డు` తీసుకొచ్చింది.
HDFC Millennia Credit Card | కస్టమర్ల డిమాండ్లకు అనుగుణంగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. వెరైటీ కార్డులు జారీ చేస్తు్న్నది. తాజాగా క్యాష్ బ్యాక్ ఆఫర్లతో మరో క్రెడిట్ కార్డు ఆవిష్కరించింది. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ ఆర్డర్ పెట్టాలన్నా.. ఫుడ్ అగ్రిగేటర్ సర్వీసులు స్విగ్గీ లేదా జొమాటోల్లో ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా మీకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మిలీనియా క్రెడిట్ కార్డు సరైన ఆప్షన్‌గా నిలుస్తుంది. కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ క్రెడిట్ కార్డును `పీఓఎస్ మిషన్`ను టచ్ చేస్తే చాలు (టాప్ అండ్ పే) చెల్లింపులు పూర్తవుతాయి.
మిలీనియల్స్ జీవన స్థితిగతులకు అనుగుణంగా మిలీనియా క్రెడిట్ కార్డు జారీ చేసింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. డిజిటల్ ఫస్ట్ జనరేషన్ దిశగా పలు ఫీచర్లు, బెనిఫిట్లు ఉన్న క్రెడిట్ కార్డు ఇది. అమెజాన్, ప్లిప్ కార్ట్ తదితర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ మీద జరిపే అన్ని రకాల చెల్లింపులపై క్యాష్ పాయింట్లు లభిస్తాయి. ఆఫ్ లైన్ కొనుగోళ్లు, ఫ్రీ లాంజ్ అడ్మిషన్లు, గిఫ్ట్ ఓచర్లపై ఒకశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఇవీ మిలీనియా క్రెడిట్ కార్డు ఫీచర్లు
అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బుక్ మై షో, కల్ట్.ఫిట్, మైంత్రా, సోనీ లివ్, స్విగ్గీ, టాటా క్లిక్, ఉబేర్, జొమాటోల్లో ఆర్డర్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు. ఈ క్యాటగిరీలో గరిష్టంగా రూ.1000 రివార్డులు పొందొచ్చు.
ఫ్యుయల్, ప్రభుత్వ బిల్లులు చెల్లింపులు మినహా అన్ని రకాల ఖర్చులపై ఒకశాతం క్యాష్ బ్యాక్. గరిష్టంగా రూ.1000 రివార్డు లభిస్తాయి.
ప్రతిఏటా దేశీయ విమానాశ్రయాల లాంజ్ల్లోకి ఎనిమిది సార్లు ఉచిత ప్రవేశం. ప్రతి త్రైమాసికంలో రెండు సార్లు ఫ్రీగా వెళ్లొచ్చు.
ఏడాది కాలంలో రూ.లక్ష ఖర్చు చేస్తే రూ.1000 గిఫ్ట్ కార్డ్ లభ్యం.
రూ.400 నుంచి రూ.5000 వరకు పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోళ్లపై ఒకశాతం ఫ్యుయల్ సర్ చార్జి మాఫీ వర్తించదు. గరిష్టంగా నెలకు రూ.250 ఫ్యుయల్ బిల్లు మాఫీ
ఇవీ అర్హతలు
వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు అర్హులు. వేతన జీవుల స్థూల నెలవారీ వేతనం కనీసం రూ.35 వేలు ఉండాలి. స్వయం ఉపాధిపై పని చేస్తున్న వారి వార్షికాదాయం రూ. 6 లక్షల పైనే ఉండాలి. కనిష్టంగా 21 ఏండ్ల నుంచి గరిష్టంగా 40 ఏండ్ల మధ్య వయస్సు గల వారు మాత్రమే ఈ క్రెడిట్ కార్డు పొందేందుకు అర్హులు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

