Electric Vehiclesకు ప్రోత్సాహం.. రెండేండ్ల వరకు ఫేమ్ పొడిగింపు..
Electric Vehiclesకు ప్రోత్సాహం.. రెండేండ్ల వరకు ఫేమ్ పొడిగింపు.. | పర్యావరణ హిత విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం..ఫేమ్-2 .......

న్యూఢిల్లీ: ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరల భగభగలు.. మరోవైపు విద్యుత్ వాహనాల ధరలు ప్రియం.. ఈ నేపథ్యంలో పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం చకచకా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2) కింద ప్రకటించిన రాయితీలను 2024 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
పబ్లిక్ అండ్ షేర్డ్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను విద్యుద్దీకరించేందుకు మద్దతు ఇవ్వడంపైనే ఫేమ్-2 ఫోకస్ చేస్తుంది. 2019 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులో ఉన్న ఫేమ్ పథకాన్ని మూడేండ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించారు.

కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఫేమ్ భారత్ ఫేస్-2ను రెండేండ్లు అంటే 2024 మార్చి 31 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. 2015 నుంచి ఫేమ్ పథకం అమలులో ఉంది.
ప్రస్తుతం విద్యుత్ వాహనాల కొనుగోలుపై ఫేమ్-2 కింద ఒక కేడబ్ల్యూహెచ్‌కు రూ.10వేల సబ్సిడీని రూ. 15 వేలకు పెంచి వేసింది. వాహనం ఖరీదులో 20 శాతమే అందించే సబ్సిడీని సైతం 40 శాతానికి పెంచింది.
దీంతో విద్యుత్ వాహనాల తయారీ సంస్థలు ఫేమ్-2 కింద వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. తదనుగుణంగా వాహన ధరలను తగ్గిస్తున్నాయి. హీరో ఎలక్ట్రిక్, ఏథేర్, ఆంపియర్, టీవీఎస్ తదితర ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు ధరలను తగ్గించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Electric Vehicles
- fame-2
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

