Google | డిసెంబర్ నుంచి లక్షల్లో జీ-మెయిల్ అకౌంట్స్ తొలగింపు.. ముందే చెప్పిన గూగుల్
Google | రెండేండ్లుగా వినియోగించని జీ-మెయిల్ ఖాతాలను తొలగిస్తామని గూగుల్ ప్రకటించింది. వచ్చేనెల నుంచి దశల వారీగా ఈ ప్రక్రియ ప్రారంభించనున్నది.
Google | మీరు సుదీర్ఘంగా జీ-మెయిల్ (Gmail) వాడటం లేదా..? అయితే ఆ మెయిల్స్ పూర్తిగా డిలిట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కనీసం రెండేండ్లు ఎటువంటి యాక్టివిటీ నిర్వహించని జీ-మెయిల్ (Gmail) అకౌంట్లు డిలిట్ చేస్తామని, తొలగింపునకు ముందు కొన్ని నెలల పాటు హెచ్చరికలతో కూడిన సందేశాలు పంపుతామని గత మే నెలలో గూగుల్ (Google) తన బ్లాగ్’లో రాసుకున్నది. వచ్చే నెల నుంచి దశల వారీగా జీ-మెయిల్ ఖాతాల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుడతామని వెల్లడించింది.
అలా డిలిట్ అయ్యే జీ-మెయిల్ (Gmail) ఖాతాతోపాటు రికవరీ మెయిల్‌కు కూడా గత మే నెలలో గూగుల్ ఇచ్చిన సందేశం వర్తిస్తుంది. ఇప్పటికే డిలిట్ ముప్పు గల జీ-మెయిల్ (Gmail) అకౌంట్లకు ఇప్పటికే పలు హెచ్చరికల సందేశాలు వచ్చి ఉంటాయి. రెండేండ్లుగా లాగిన్ కాకుండా ఉన్న జీ-మెయిల్ (Gmail) అకౌంట్లతోపాటు వాటితో అనుసంధానమైన డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలండర్, ఫోటోస్‌లోని కంటెంట్ కూడా డిలిట్ అవుతుందని గూగుల్ (Google) తేల్చి చెప్పింది. అయితే కనీసం రెండేండ్లుగా నిరుపయోగంగా ఉన్న వ్యక్తిగత జీ-మెయిల్ (Gmail) అకౌంట్లు మాత్రమే డిలిట్ చేస్తామని పేర్కొన్నది. గూగుల్ (Google) తన బ్లాగ్’లో వెల్లడించినట్లు రెండేండ్లకోసారైనా జీ-మెయిల్ ఖాతాలో లాగిన్ కావాలి. గూగుల్ అకౌంట్, దానికి అనుసంధానమైన ఏ సేవనైనా రెండేండ్లలో ఒకసారి వాడుకోవాలి.
గూగుల్ డ్రైవ్ (Google Drive) వాడటంతోపాటు లాగ్ ఇన్ అయి యూ-ట్యూబ్ (You-Tube)’లో వీడియో చూసినా, గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకున్నా, గూగుల్ ఖాతా సాయంతో థర్డ్ పార్టీ యాప్ లాగిన్ అయినా.. మీ జీ-మెయిల్ ఖాతాకు ఢోకా లేనట్లే. ఇదిలా ఉంటే యూ-ట్యూబ్ (You-Tube) వీడియోస్‌తో లింక్ చేసి ఉన్న అకౌంట్లు మాత్రం తొలగించబోమని గూగుల్ క్లారిటీ ఇచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

