Google Play Store | వెనక్కు తగ్గిన గూగుల్.. ప్లే స్టోర్‌లో యాప్స్ పునరుద్ధరణకు ఓకే..!
Google Play Store | ఇటీవల గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన భారతీయ కంపెనీల యాప్‌లను పునరుద్ధరించడానికి గూగుల్ అంగీకరించింది.
Google Play Store | ఇటీవల గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన భారతీయ కంపెనీల యాప్‌లను పునరుద్ధరించడానికి గూగుల్ అంగీకరించింది. కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో గూగుల్, స్టార్టప్ కంపెనీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మున్ముందు దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
తమ నిబంధనలకు అనుగుణంగా పేమెంట్స్ చేయట్లేదని పేర్కొంటూ వివిధ డెవలపర్ల యాప్స్‌ను శుక్రవారం గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. గూగుల్ చర్యను తప్పుబట్టడంతోపాటు స్టార్టప్‌లకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో ఐటీ మంత్రిత్వశాఖ అధికారులతో జరిగిన చర్చల్లో సంబంధిత సంస్థల యాప్స్ తిరిగి యూజర్లకు అందుబాటులోకి తేవడానికి గూగుల్ అంగీకరించింది.
యాప్స్ డెవలపర్ల నుంచి 15-30 శాతం చార్జీలు వసూలు చేయరాదని గూగుల్ యాజమాన్యాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గతంలోనే ఆదేశించింది. దీంతో 11-26 శాతం ఫీజు వసూలు చేస్తున్న గూగుల్‌పై మ్యాట్రిమోనీ డాట్ కాం, షాదీ డాట్ కామ్, ఇన్ఫో ఎడ్జ్, అనాకడమీ, ఆహా, డిస్నీ+ హాట్ స్టార్ తదితర సంస్థలు సవాల్ చేశాయి. ఈ పరిస్థితుల్లో తమ ప్లాట్‌ఫామ్ వాడుకుని ప్రయోజనాలు పొందుతున్నా పది కంపెనీలు ఫీజు చెల్లించడం లేదని గూగుల్ ఆరోపించింది. దీనిపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని వివరించింది. ఈ నేపథ్యంలో గూగుల్ తన గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్‌ను డీ లిస్ట్ చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

