Google | టాప్ `సెర్చింజన్`గా గూగుల్.. అందుకు అదేం ఏం చేస్తుందంటే?!
Google | టాప్ సెర్చింజన్‌గా కొనసాగేందుకు గూగుల్‌లో కోట్ల డాలర్లు ముడుపులు చెల్లిస్తుందని అమెరికా న్యాయశాఖ ఆరోపణ.
Google | గూగుల్ అంటే సెర్చింజన్ అని మనందరికీ తెలుసు.. కానీ దీని వెనుక దాగి ఉన్న రహస్యాన్ని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ (డీవోజే) బయటపెట్టింది. ప్రపంచంలోనే నంబర్ వన్ సెర్చింజన్‌గా తాను కొనసాగేందుకు ఎలక్ట్రానిక్, టెక్నాలజీ దిగ్గజ సంస్థలు ఆపిల్ ఇంక్, శ్యామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో తదితర టెలికం సంస్థలకు అల్ఫాబెట్ ఇంక్ అనుబంధ గూగుల్ ఏటా వందల కోట్ల డాలర్ల ముడుపులు చెల్లిస్తుందట.
ఇది అమెరికా ఫెడరల్ జడ్జి అమిత్ మెహతాకు డీవోజే అటార్నీ కెన్నెత్ డింజర్ వెల్లడించిన సమాచారం. అయితే గూగుల్ ఎంత మొత్తం చెల్లిస్తుందన్న సంగతి మాత్రం కెన్నెత్ డింజర్ బయట పెట్టలేదు. బ్రౌజర్లు, అన్ని అమెరికా మొబైల్ ఫోన్లలో డిఫాల్ట్ సెర్చింజన్‌గా కొనసాగేందుకు భారీ మొత్తంలో ఇతర టెక్ దిగ్గజ సంస్థలకు ముడుపులు చెల్లిస్తుందని మాత్రం కెన్నెత్ డింజర్ తెలిపారు.
ఆన్లైన్ సెర్చింజన్‌గా కొనసాగేందుకు గూగుల్ యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని ఆరోపిస్తూ డీవోజే దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. సెర్చింజన్‌గా నంబర్‌వన్ స్థానంలో కొనసాగేందుకు ముడుపులు చెల్లిస్తుందన్న పిటిషన్‌తోపాటు గూగుల్‌పై యాంట్రీ ట్రస్ట్ సూట్ కూడా డీవోజే దాఖలు చేసింది. ఫెడరల్ జడ్జి అమిత్ మెహతా బెంచ్ ముందు ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

