Google Layoffs | గూగుల్ లేటెస్ట్ లేఆఫ్స్ : 1000 మందిపై టెక్ దిగ్గజం వేటు
టెక్ దిగ్గజం గూగుల్ మరో దశ లేఆఫ్స్‌కు తెగబడింది. లేటెస్ట్ లేఆఫ్స్‌లో భాగంగా సెర్చింజన్ దిగ్గజం ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొలగించినట్టు సమాచారం.
Google Layoffs : టెక్ దిగ్గజం గూగుల్ మరో దశ లేఆఫ్స్‌కు తెగబడింది. లేటెస్ట్ లేఆఫ్స్‌లో భాగంగా సెర్చింజన్ దిగ్గజం ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. గూగుల్ హార్డ్‌వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్‌లు, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లో కంపెనీ కొలువుల కోతకు పాల్పడింది. లేఆఫ్స్ గురించి ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నామని, సంక్లిష్ట నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని బాధిత ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో కంపెనీ పేర్కొంది.
అర్హులైన ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్ వర్తింపచేస్తామని గూగుల్ స్పష్టం చేసింది. ఇతర విభాగాల్లో ఎంపిక చేసిన అవకాశాలకు వేటుకు గురైన ఉద్యోగులు తిరిగి దరఖాస్తు చేసుకోచ్చని పేర్కొంది. కంపెనీలో తిరిగి అవకాశం దక్కని ఉద్యోగులు ఏప్రిల్‌లో కంపెనీని వీడాలని తెలిపింది.
ఇక 2023లోనే భారీగా ఉద్వాసనలు పలికిన టెక్ సంస్థలు.. ఈ సంవత్సరంలోనూ అదే వరవడి కొనసాగిస్తున్నాయి.ఈ నెల 15 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 48 టెక్ కంపెనీలు 7,528 మంది నిపుణులను ఇంటికి సాగనంపాయని లే-ఆఫ్ ట్రాకింగ్ వెబ్ సైట్ లే-ఆప్స్.ఎఫ్‌వైఐ ప్రకటించింది. ఈ ఉద్వాసనలు 2024లోనూ కఠిన నిర్ణయాలకు దారి తీస్తాయన్న సంకేతాలు వస్తున్నాయి. 2023లో 1150కి పైగా టెక్ కంపెనీలు 2.60 లక్షల మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చాయి.
Read More :
Ram Temple-CAIT | రామ మందిర ప్రారంభంతో రూ.లక్ష కోట్ల బిజినెస్.. తేల్చి చెప్పిన కెయిట్ సెక్రటరీ జనరల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

