Google layoffs | ఏఐ డివిజన్లో గూగుల్ లేటెస్ట్ లేఆఫ్స్
ఈ ఏడాది ఆరంభంలోనే టెక్ దిగ్గజాలు కొలువుల కోతకు తెగబడటంతో టెకీల్లో గుబులు నెలకొంది. అమెజాన్ పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ (Google layoffs) ఫ్రెష్ లేఆఫ్స్‌ను ప్రకటించడం కలకలం రేపుతోంది.
న్యూఢిల్లీ : 2023లో టెక్ దిగ్గజాలు సహా పలు కంపెనీలు ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగబడగా ఇదే ట్రెండ్ 2024లోనూ కొనసాగుతుందా అనే ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఆరంభంలోనే టెక్ దిగ్గజాలు కొలువుల కోతకు తెగబడటంతో టెకీల్లో గుబులు నెలకొంది. అమెజాన్ పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ (Google layoffs) ఫ్రెష్ లేఆఫ్స్‌ను ప్రకటించడం కలకలం రేపుతోంది.
ఏఐ డివిజన్లో ఉద్యోగుల తొలగింపుకు గూగుల్ తెగబడటంతో మరోసారి లేఆఫ్స్ భయం టెకీలకను వెంటాడుతోంది. కొలువుల కోతతో గూగుల్‌లో వందలాది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. గూగుల్ పునర్వ్యవస్ధీకరణ, వ్యయ నియంత్రణ వ్యూహంలో భాగంగా టెక్ దిగ్గజం ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. హార్డ్‌వేర్ డివిజన్, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ టీమ్స్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్టు గూగుల్ 9టూ5గూగుల్ స్టేట్మెంట్లో నిర్ధారించింది.
తాజా జాబ్‌కట్స్ వాయస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్, ఏఆర్ హార్డ్‌వేర్ టీం, కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్‌లో పనిచేసే వారిపై ప్రభావం చూపుతాయని కంపెనీ పేర్కొంది. మైక్రోసాప్ట్, ఓపెన్ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరింగ్స్లో గూగుల్‌కు దీటైన పోటీ ఎదురవడంతో గూగుల్ మెయిన్ సెర్చి బిజినెస్‌పై ప్రభావం చూపుతోంది. దీంతో గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తమ కీలక లక్ష్యాల దిశగా మరిన్ని నిధులు కేటాయించేందుకు ఏయే రంగాల్లో వ్యయ నియంత్రణ చేపట్టాలనే దానిపై తర్జనభర్జన సాగిస్తున్నారు.
Read More :
Duolingo Layoffs | ఏఐతో కొలువుల కోత : టెకీలపై డ్యులింగో వేటు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

