Gold Rates | రికార్డు స్థాయికి బంగారం ధర..! తొలిసారిగా రూ.65వేల మార్క్‌ను దాటిన పసిడి..!
Gold Rates | దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తొలిసారిగా తులం రూ.65వేలకు పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఈ ఏడాది జూన్‌లో తగ్గింనుందన్న ఊహాగానాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది.
Gold Rates | దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తొలిసారిగా తులం రూ.65వేలకు పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఈ ఏడాది జూన్‌లో తగ్గించనుందన్న ఊహాగానాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరుగుతుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం బులియన్ మార్కెట్లో రూ.800 పెరిగి తులం బంగారం రూ.65వేలకు పెరిగి.. రికార్డు స్థాయికి చేరింది. గత ట్రేడింగ్ సెషన్లో బంగారం రూ.64,200 వద్ద ముగిసింది. మరో వైపు వెండి సైతం రూ.900 వరకు పెరిగి కిలోకు రూ.74,900కు ఎగిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్‌పై తులానికి రూ.800 పెరిగి రూ.65వేల వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్‌లో గోల్డ్ స్పాట్ ధర ఔన్స్‌కు 2110 డాలర్లకు చేరింది. గత మూడురోజుల్లోనే ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.2400 వరకు పెరిగింది. ఎల్కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ యూఎస్‌లో పారిశ్రామిక, నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గించడంతో బంగారం ధరలు పెరిగాయన్నారు.
అంతే కాకుండా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు సైతం బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయన్నారు. మరో వైపు మార్కెట్లో వెండి ధర ఔన్స్‌కు 23.88 డాలర్లు పెరిగింది. కిత్రం సెషన్లో వెండి ఔన్స్‌కు 23.09 డాలర్ల వద్ద కొనసాగింది. ఓవర్సీస్ మార్కెట్లో డాలర్ స్థిరంగా ఉన్నప్పటికీ.. బంగారం, వెండి ధరలు మెరుగయ్యాయని.. రెండు సానుకూలంగా ట్రేడవుతున్నాయని జేఎం ఫైనాన్షియల్ వైస్ ప్రెసిడెంట్ ప్రణబ్ మెర్ పేర్కొన్నారు. యూఎస్ ఫెడరల్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాల మధ్య పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులను సురక్షితమైనవి భావిస్తున్నారు. ఈ క్రమంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని తెలిపారు.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.60,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.65,620 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.59,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.64,850కి చేరింది. ఢిల్లీలో రూ.59,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.65వేలకు పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పుత్తడి రూ.59,450 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.64,850కి చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,200 పలుకుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

