Gold Rate | మూడు రోజులుగా దిగొచ్చిన బంగారం ఒక్కసారిగా యూటర్న్.. భారీగా పెరిగిన ధరలు..!
Gold Rate | భారత్లో బంగారం ధరల (Gold price) కు మళ్లీ రెక్కలొచ్చాయి. గత మూడు రోజులుగా వరుసగా పతనమైన ధరలు గురువారం ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు పెరిగాయి. డాలర్ (Dallor) బలహీనపడటం, యూఎస్ బాండ్స్ (US bonds) పై రాబడులు తగ్గడంతో బంగారానికి మళ్లీ డిమాండ్ పుంజుకుంది.
Gold Rate : భారత్లో బంగారం ధరల (Gold price) కు మళ్లీ రెక్కలొచ్చాయి. గత మూడు రోజులుగా వరుసగా పతనమైన ధరలు గురువారం ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు పెరిగాయి. డాలర్ (Dallor) బలహీనపడటం, యూఎస్ బాండ్స్ (US bonds) పై రాబడులు తగ్గడంతో బంగారానికి మళ్లీ డిమాండ్ పుంజుకుంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. గురువారం (సెప్టెంబర్ 3) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,333 పెరిగింది.
దాంతో తులం 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,55,350 కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.3,020 మేర పెరిగి రూ.1,42,400కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,510 కి ఎగబాకింది. ఇక వెండి విషయానికి వస్తే నగరంలో కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.5 వేల మేర పెరిగి రూ.2.5 లక్షలకు చేరుకుంది. అయితే ఈ ధరల్లో దేశంలోని వేర్వేరు నగరాల్లో స్వల్ప తేడా కనిపిస్తోంది.
చెన్నై, ముంబై, పుణె, కోల్కతా, బెంగళూరు, తిరువనంతపురంలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,55,350 గా ఉన్నది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.1,42,400 గా ఉన్నది. వడోదరలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,55,400 గా ఉన్నది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.1,42,450 గా ఉన్నది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,55,500 గా ఉన్నది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.1,42,550 గా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Chennai
- Delhi
- Gold prices
- Gold rate
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

