Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..!
Gold Price | ఇవాళ దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ముడి చమురు (Crude Oil) ధరలు తగ్గడం, పశ్చిమాసియా (West Asia) లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కారణాలతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్ పెరిగింది.
Gold Price : ఇవాళ దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ముడి చమురు (Crude Oil) ధరలు తగ్గడం, పశ్చిమాసియా (West Asia) లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కారణాలతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్ పెరిగింది. దాంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో ఇవాళ ఉదయం 11:20 గంటల సమయంలో ఆగస్ట్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1,460 పెరిగి 10 గ్రాములకు రూ.1,42,848 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అదేవిధంగా సెప్టెంబర్ డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ ధర రూ.3,380 పెరిగి కిలోకు రూ.2,21,780 గరిష్ఠాన్ని తాకింది. ట్రేడింగ్ ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,386, కిలో వెండి ధర రూ.2,19,200 గా నమోదైంది.
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు పడిపోవడం దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయనే నివేదికలు, ఇరాన్‌పై అమెరికా తన వైమానిక దాడులను నిలిపివేసిందని వచ్చిన వార్తలు ముడి చమురు ధరల తగ్గుదలకు కారణమయ్యాయి. గతంలో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వంటి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అయితే మార్కెట్ నిపుణుల ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, బలమైన డాలర్ ఒత్తిడిని అధిగమించి సురక్షిత పెట్టుబడిగా బంగారానికి మద్దతునిస్తోంది. ఈ కారణంగానే పెట్టుబడిదారులు బంగారంవైపు మొగ్గు చూపుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

