Gold Loans | బంగారంపై చౌక వడ్డీకే రుణాలిస్తున్న బ్యాంకులివే!
Gold Loans | భారతీయుల తక్షణ అవసరాలకు తీరాలంటే బంగారం రుణమే ఆధారం. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలిస్తున్నాయి.
Gold Loans | బంగారం అంటే భారతీయులకు.. ప్రత్యేకించి మహిళాలోకానికి ఆభరణం మాత్రమే కాదు.. మదుపర్లకు సురక్షిత పెట్టుబడి మార్గం కూడా. తక్షణ అవసరాలు తీర్చుకోవాలంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది బంగారం తాకట్టుపై రుణమే. తరుచుగా బంగారంపై ప్రజలు రుణాలు తీసుకుంటూ ఉంటారు. అందువల్లే బంగారంపై రుణం పాపులారిటీ సంపాదించుకున్నది. భారత్ వంటి దేశంలో బంగారం కూడబెట్టుకోవడం ఒక పద్దతి. బంగారంపై రుణం తీసుకోవడం తేలిక కూడా. ఆర్థిక అవసరాల కోసం బంగారం తనఖా పెట్టి మరీ రుణం తీసుకోవచ్చు. దీర్ఘాలిక పెట్టుబడులు.. అంటే స్థిరాస్తులను విక్రయించకుండా బంగారం తనఖా పెట్టి రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. బంగారంపై రుణాలిస్తున్న బ్యాంకులు అమలు చేస్తున్న వడ్డీరేట్లు చూద్దామా..!
బ్యాంకు ——————- వడ్డీరేటు ———— ప్రాసెసింగ్ ఫీజు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ———- 7% ———————– రూ.500 నుంచి రూ. 2000 తోపాటు జీఎస్టీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ——– 7% ———————– మొత్తం రుణంపై7.50శాతం
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ — 7% – 7.50% ————- రూ.500 నుంచి రూ. పదివేలు
యూనియన్ బ్యాంక్ ————- 7.25% నుంచి 8.25% — ————-
కెనరా బ్యాంక్ ——————– 7.35% ——————- రూ.500 to Rs 5000
బంగారంపై రుణానికి సమర్పించాల్సిన పత్రాలు
పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, పాన్ కార్డు, వ్యవసాయ అనుబంధ వృత్తి పత్రాలు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్.
ఏ బంగారం తాకట్టు పెట్టాలంటే..
18 లేదా 22 క్యారట్లతో తయారైన ఆభరణాలు, బ్యాంకు మింటెడ్ 24 క్యారట్ల బంగారం కాయిన్స్ 50 గ్రాముల బంగారం వరకు తాకట్టు పెట్టొచ్చు. హెయిర్ పిన్స్, కఫ్లింక్స్, బంగారం గడియారం, పాత్రలు, పట్టీలు తదితర ఆభరణాలపై 50 శాతం వరకు డిడక్షన్ చేస్తారు. మంగళ సూత్రాల తాడు, వైట్ గోల్డ్, డైమండ్ జ్యువెల్లరీ, గిల్ట్ బంగారం, గిన్నీ, గోల్డ్ బార్లపై బంగారం రుణాలు ఇవ్వరు.
బంగారం రుణం చెల్లింపు మోడ్ ఇలా
రుణ గ్రహీత బంగారంపై రుణం చెల్లింపునకు ఈ పద్దతులు పాటించొచ్చు. రుణం పంపిణీ చేసిన తర్వాత నెల నుంచి అసలు, వడ్డీ చెల్లింపు మొదలవుతుంది.. దీన్నే నెలవారీ వాయిదా ఆధారిత బంగారం రుణం ( Gold Loan EMI based ) అని అంటారు. నెలవారీ వడ్డీ చెల్లింపుతోపాటు ఓవర్డ్రాఫ్ట్ ఖాతా లావాదేవీ ఫెసిలిటీ కల్పించడాన్ని లిక్విడ్ గోల్డ్ లోన్ అని చెబుతారు. గడువు లోపు వడ్డీ ప్లస్ అసలు కలిపి చెల్లించే విధానాన్ని గోల్డ్ లోన్ బుల్లెట్ రీపేమెంట్ ( Bullet Repayment Gold Loan ) అని అంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

