హౌజింగ్ లోన్కెళ్తున్నారా

అప్పు చేసి ఇల్లు కొనుక్కోవడమంటే ఆర్థికంగా చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటున్నట్టే లెక్క. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఓ చిన్న పొరపాటు చేసినా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళిక అంతా తలకిందులు కావచ్చు. హోమ్‌లోన్ అంటేనే పెద్ద మొత్తంలో తీసుకునే దీర్ఘకాలిక రుణం. వివిధ బ్యాంకులు ఇప్పటికే గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. అయితే హోమ్లోన్ల మంజూరులో ఛార్జీలు, వడ్డీ రేట్లలో మార్పుల వంటి అంశాలు భారాన్ని మోపే విధంగా ఉంటాయి. అలాగే నిర్మాణంలో ఉన్నదా? లేక సిద్ధంగా ఉన్న గృహమా? అనే అంశం కూడా చాలా ప్రధానం. హోమ్‌లోన్ తీసుకునే ముందు మీకు మీరే సంధించుకోవాల్సిన ప్రశ్నలేవిటో ఒక్కసారి చూద్దాం. వాటికి మీరు సంతృప్తి పడే సమాధానాలు మీ వద్ద ఉంటే సంతోషంగా హోమ్‌లోన్ తీసుకోండి.
కొనే ఇల్లు ఇన్వెస్ట్‌మెంటా? నివాసానికా?
ఇల్లు కొనేముందు దేని కోసం తీసుకుంటున్నామో వివరంగా తెలుసుకోండి. మీరు స్వయంగా ఉండటానికా లేక ఇన్వెస్ట్మెంట్ కోసమా తెలుసుకోండి. ఒకవేళ మీరే ఉండటానికి తీసుకుంటున్నట్లయితే, ఎన్ని అడుగులు, బెడ్ రూంలు మీ కుటుంబానికి సరిపోతాయో అంచనా వేసుకోండి. ఇల్లుతో పాటు అదనపు సౌకర్యాలు ఆ ప్రాపర్టీలో ఏమున్నాయో చూసుకోండి. మీరు తీసుకునే ఇంటి పరిసరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసమే తీసుకుంటున్నట్లయితే, ఆ ప్రాపర్టీ ఎంత రాబడిని ఇవ్వగలదో ఓ అంచనాకు రండి. ప్రాపర్టీ విలువ పెరగడానికి గల అవకాశాలు, అద్దె ఆదాయం వంటి విషయాల్లో స్పష్టత అవసరం.
ఈఎంఐలు చెల్లించగలరా?
హోమ్‌లోన్ అంటేనే దీర్ఘకాలం పాటు తీసుకునే రుణం. హోమ్‌లోన్ తీసుకునే ముందు ఇప్పటికే మీరు తీసుకున్న రుణాలు, వాటికి చెల్లిస్తున్న ఈఎంఐలు, అవి ఎన్ని నెలల్లో తీరిపోతాయి వంటి లెక్కలు వేసుకోవడం చాలా అవసరం. ఈఎంఐలు అన్నీ పోగా మీకు నికరంగా మిగిలే మొత్తాన్ని బట్టి మీ హోమ్‌లోన్ అర్హత ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఈఎంఐలు మీరు మరో దీర్ఘకాలిక రుణానికి చెల్లించే శక్తిని తగ్గిస్తాయి. మరో రుణం లేకుండా చూసుకోండి. అలాగే మీ టేక్‌హోమ్ సాలరీ ఎక్కువగా ఉంటే అత్యధికంగా రుణం తీసుకునే అవకాశం ఉంటుంది.
స్థిర ఆదాయం- కో అప్లికెంట్
హోమ్‌లోన్‌కు వెళ్లాలంటే స్థిర ఆదాయాన్ని చూపించగలగాలి. మీరు సమయానికి ఈఎంఐని చెల్లించగలరా? లేదా అనే అంశాన్ని బ్యాంకులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. మీకు ఇప్పటికే వస్తున్న వేతనానికి తోడు అదనపు ఆదాయాలు ఉంటే మరీ మంచిది. ఒకవేళ మీకు హోమ్‌లోన్ తీసుకునేంత ఆదాయం లేకపోతే, మీ భార్య లేదా భర్త ఆదాయాన్ని కూడా జత చేసి కో-అప్లికెంట్ దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు ఇద్దరి ఆదాయాల మీద మీకు రుణ పరిధి పెరుగుతుంది. మహిళలకు సాధారణంగా తక్కువ వడ్డీ రేటు ఉండే అవకాశం ఉన్నందున, వారినే మొదటి అప్లికెంట్‌గా ఉంచండి.
వీటన్నింటికి తోడు..
ప్రాపర్టీ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించడం, దానిపై న్యాయ సలహా తీసుకోవడం అవసరం. అలాగే మీకు జీవిత బీమా కవరేజి కూడా ఉండటం అంతే ముఖ్యం. బ్యాంకులు కూడా జీవిత బీమా కవరేజిని ఒక అర్హతగా చూస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా హోమ్ లోన్ తీసుకోవడం వల్ల మీ ఆర్థిక లక్ష్యాలకు విఘాతం కలుగకుండా చూసుకోవాలి.
మీ క్రెడిట్ స్కో ర్ ఎంత?
బ్యాంకులు అన్నీ మీ క్రెడిట్ స్కోర్‌కు రుణానికి లింక్ పెడతాయి. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే అధిక వడ్డీని వసూలు చేస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ 750 నుంచి 800 పైన ఉండేలా చూసుకోండి. కేవలం హోమ్‌లోన్ తీసుకునే సమయంలోనే కాదు, మొత్తం రుణాన్ని చెల్లించే వరకు క్రెడిట్ స్కోర్ ఆ స్థాయిలోనే ఉండేలా చూసుకోండి. లేదంటే మధ్యలో కూడా క్రెడిట్ స్కోర్ బాగా లేని కారణంగా మీకు అదనపు వడ్డీ భారం పడే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

