Future To Amazon | అమెజాన్ నుంచి ఆ రుణానికి రెడీ.. ఫ్యూచర్ రిటైల్ సంకేతాలు!
Future To Amazon | గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ నుంచి రూ.3500 కోట్ల రుణం తీసుకునేందుకు సిద్ధమని ఫ్యూచర్ సంకేతాలిచ్చింది.

Future To Amazon | గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ నుంచి కిశోర్ బియానీ సారధ్యంలోని ఫ్యూచర్ రిటైల్ రూ.3500 కోట్ల విలువైన దీర్ఘకాలిక రుణం తీసుకోవాలని భావిస్తున్నది. ఈ నెల 24 లోగా అమెజాన్ నుంచి రుణం తీసుకోవాలని భావిస్తున్నది. డిఫాల్డ్ ముద్ర పడకుండా రుణ వాయిదా చెల్లింపుకోసం స్మాల్ ఫార్మాట్ స్టోర్ల విక్రయానికి ఫ్యూచర్ రిటైల్ చేసిన ప్రయత్నాలను అమెజాన్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. స్మాల్ ఫార్మాట్ స్టోర్ల విక్రయాన్ని మీరు వ్యతిరేకించినప్పటి నుంచి.. డిఫాల్డర్ లేదా మొండి బకాయి ముద్ర పడకుండా నివారించడానికి సంస్థ ప్రయత్నిస్తున్నట్లు అమెజాన్‌కు రాసిన లేఖలో ఫ్యూచర్ రిటైల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ తెలిపారు.
రుణ దాతలకు నెలసరి వాయిదా చెల్లింపు కోసం సోమవారం కల్లా (జనవరి 24) అన్ సెక్యూర్డ్, దీర్ఘకాలిక రుణం కింద నిధులు సమకూర్చగలరా? అని అమెజాన్‌ను ఆ ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్రశ్నించారు. మీరు ఆ నిధులు సమకూరిస్తే, ఎఫ్ఆర్ఎల్ తన రుణ దాతలకు రుణ వాయిదా చెల్లిస్తుంది. ప్రత్యామ్నాయంగా మీరు రుణ దాతలతో నేరుగా సంప్రదింపులు జరిపినా ఓకే. కానీ రుణాల ఓటీఆర్ (వన్‌టైం రీస్ట్రక్చరింగ్) ప్రక్రియ లేదా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తవద్దని మేం భావిస్తున్నాం అని ఆ లేఖలో వివరించారు.
ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్)కు బిగ్ బజార్ హైపర్ మార్కెట్ స్టోర్ల చైన్ నెట్వర్క్ ఉంది. ఇది ఈ నెల 29 లోపు రుణ బకాయి చెల్లించాల్సి ఉంది. ఒకవేళ గడువు లోపు చెల్లించకుంటే ఫ్యూచర్ రిటైల్ సంస్థ రుణాలను మొండి బకాయిగా మార్చే అవకాశం ఉంది. అలా మొండి పద్దుగా వర్గీకరించకుండా చూసేందుకు ఈజీడే, హెరిటేజ్ ఫ్రెష్ బ్రాండ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 800 స్మాల్ ఫార్మాట్ స్టోర్ల చైన్‌ను విక్రయించడానికి ఫ్యూచర్ రిటైల్ ప్రయత్నించింది. కానీ దీనికి అమెజాన్ ఆమోదం తీసుకోలేదు. సహజంగానే ఫ్యూచర్ రిటైల్ తీరుపై అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా విక్రయ ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది అమెజాన్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Amazon
- future retail
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

