SBI – Challa Sreenivasulu | ఎస్బీఐ చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి..!
SBI - Challa Sreenivasulu | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ ‘ఎస్బీఐ’ తదుపరి చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి ఎంపికయ్యారు.
SBI – Challa Sreenivasulu | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ ‘ఎస్బీఐ’ తదుపరి చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి ఎంపికయ్యారు. ప్రస్తుతం బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్లలో ఆయన ఒకరు. ఈ మేరకు చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
‘పనితీరు, అనుభవంతోపాటు ఇతర పారామీటర్లను పరిగణనలోకి తీసుకుని ఎస్బీఐ చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎంపిక చేశాం’ అని ఎఫ్ఎస్ఐబీ శనివారం జారీ చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. శనివారం ఎస్బీఐలోని ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్లను ఎఫ్ఎస్ఐబీ ఇంటర్వ్యూ చేసింది.
ఇంతకుముందు 2020 అక్టోబర్ ఏడో తేదీన ప్రస్తుత ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఎంపికయ్యారు. అయితే గతేడాది అక్టోబర్లో ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఆయన వయస్సు 63 ఏండ్లు వచ్చే వరకూ అంటే ఈ ఏడాది ఆగస్టు 28 వరకూ దినేష్ కుమార్ ఖరా పదవీ కాలాన్ని పొడిగించింది.
తాజాగా దినేష్ కుమార్ ఖరా స్థానంలో కొత్త ఎస్బీఐ చైర్మన్గా ఎంపికైన చల్లా శ్రీనివాసులు శెట్టి.. ప్రస్తుతం బ్యాంకు రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ అధిపతిగా ఉన్నారు. ఏజీబీఎస్సీ పూర్తి చేసిన శ్రీనివాసులు శెట్టి.. సర్టిఫైడ్ అసోసియేట్ ఆఫ్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్లో పట్టా పొందారు. 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఎస్బీఐలో కెరీర్ ప్రారంభించారు. 30 ఏండ్లకు పైగా ఎస్బీఐలో సేవలందించిన చల్లా శ్రీనివాసులు శెట్టి.. కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, అభివృద్ధి చెందిన మార్కెట్లలో బ్యాంకింగ్ విభాగాల్లో అనుభవాన్ని గడించారు.
ఇవి కూడా చదవండి :
Tata Motors | ఆరేండ్లలో 60 లక్షల కార్ల విక్రయాలు.. ఇదీ టాటా మోటార్స్ బ్లూ ప్రింట్ ..!
Maruti Suzuki Swift | మారుతి ‘సిగ’లో మరో మైలురాయి.. 30 లక్షలు దాటిన ‘స్విఫ్ట్’ సేల్స్..!
Bharti Airtel | ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్ల మోత.. 20 శాతం వరకూ పెంపు..
July Bank Holidays | జూలైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. .ఇవీ డిటైల్స్..!
Realme C61 5G | రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

