FPIs investments | విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల్లో రికార్డు.. డిసెంబర్లో ఎంతో తెలుసా..?!
FPIs investments | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ నెల తొలి ఆరు సెషన్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ.26,505 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు చేశారు.
FPIs investments | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ నెల తొలి ఆరు సెషన్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ.26,505 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు చేశారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో దేశీయంగా రాజకీయ సుస్థిరత బలోపేతం అవుతుందన్న అంచనాల మధ్య ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు ప్రోత్సాహానికి దోహద పడుతుంది.
గత అక్టోబర్ నెలలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.9,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరోవైపు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రూ.39,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించారు. అయితే, మారిన పరిస్థితుల్లో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో షేర్లు కొనుగోలు చేయొచ్చునని జియోజిట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ స్ట్రాటర్జిస్ వీకే విజయ కుమార్ తెలిపారు. ఈ నెల ఎనిమిదో తేదీ నాటికి దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల నికరంగా రూ.26,505 కోట్లు పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్లలో రూ.1.31 లక్షల కోట్లు, డెట్ మార్కెట్లలో రూ.55,867 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
బాండ్ల మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే డెట్ మార్కెట్లోకి అక్టోబర్ నెలలో రూ.6,381 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత నెలలో ఆరు నెలల గరిష్ట స్థాయిలో ఎఫ్‌పీఐలు రూ.14,860 కోట్ల పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ట్రెజరీ బాండ్ల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు.. భారత్ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాత్సవ చెప్పారు. ఐటీ, టెలికం, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

