Foxconn EV | విద్యుత్ వాహనాల్లోకి ఫాక్స్‌కాన్.. మూడు వెహికల్స్ ఆవిష్కరణ
Foxconn EV | ప్రముఖ టెక్ సంస్థ ఫాక్స్‌కాన్.. విద్యుత్ వాహనాల విపణిలోకి ప్రవేశిస్తున్నది. ఫాక్స్ట్రాన్స్ పేరుతో వస్తోంది.

Foxconn EV | ప్రస్తుతం విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్.. అదే దేశానికి చెందిన యూలోన్ మోటార్ కోతో జత కట్టింది. ఇప్పుడు కాంట్రాక్టుపై భారత్‌లో గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్.. ఐఫోన్లను తయారు చేస్తున్నది.
యూలోన్ మోటార్స్కోతో కలిసి డిజైన్ చేసిన తొలి మూడు ఎలక్ట్రిక్ వాహన నమూనాలను సోమవారం ఆవిష్కరించింది. యూలోన్ మోటార్ కోతో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ వెహికల్స్ ఫాక్స్ట్రాన్ అనే పేరుతో అందుబాటులోకి వస్తాయి. ఫాక్స్ ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఫాక్స్ట్రాన్ సెడాన్, ఫాక్స్ ట్రాన్ బస్సు ఉత్పత్తి చేయనున్నది ఫాక్స్‌కాన్.

వచ్చే ఐదు ఏండ్లలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 35 బిలియన్ డాలర్లకు చెరనుంది అని ఫాక్స్ ట్రాన్ వైస్ ఛైర్మన్ సోచిసెన్ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారైన ఫాక్స్‌కాన్ ప్రపంచ ఈవీ మార్కెట్లో లీడర్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తొలుత 2019 నవంబర్‌లో ఈవీ వెహికల్స్ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్‌లో పెరిగే డిమాండ్ నేపథ్యంలో విద్యుత్ వాహనాల మార్కెట్లోకి అడుగు పెట్టామన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

