నిధుల కోసం కొవిడ్ బాండ్లు

- ఏ ప్రత్యామ్నాయం లేకపోతేనే కరెన్సీ ముద్రణ
- ప్రభుత్వానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సూచనలు
న్యూఢిల్లీ, జూన్ 9: కరోనా సంక్షోభంతో మందకొడిగా వున్న ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చేందుకు, రిజర్వుబ్యాంక్ కరెన్సీ ముద్రించి ప్రభుత్వానికి ఫైనాన్స్ చేయవచ్చని, దాని బదులు ప్రభుత్వం కొవిడ్ బాండ్లు జారీచేసి నిధులు సమీకరించడం మంచిదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు. ఎటువంటి ప్రత్యామ్నాయం లేకపోతే తప్పా కరెన్సీ ముద్రణ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పీటీఐ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో దువ్వూరి పలు సూచనల్ని చేశారు. అవి….
- ఆర్బీఐ డబ్బును ముద్రించవచ్చు. ప్రభుత్వం తన ద్రవ్యలోటును తక్కువ వడ్డీ రేట్లకు ఫైనాన్స్ చేసుకోలేకపోతేనే ముద్రణ అవసరం అవుతుంది. దేశంలో ఇప్పుడా పరిస్థితి లేదు.
- ప్రభుత్వం లోటును ఫైనాన్స్ చేయడానికి ఆర్బీఐ కరెన్సీని ముద్రించాలంటూ చెపుతున్నవారు గ్రహించనిదేమిటంటే, ఇప్పుడు కూడా ఆర్బీఐ డబ్బును ముద్రిస్తుందని. అయితే ఆ ముద్రణ పరోక్షంగా జరుగుతుంది.
- ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓలు) ద్వారా బాండ్లు కొనడం, ఫారెక్స్ ఆపరేషన్స్ ద్వారా డాలర్లు కొనడం వంటి కార్యకలాపాలకు చెల్లింపులు చేయడానికి డబ్బు ముద్రిస్తుంది.
- ఇటువంటి లిక్విడిటీ కార్యకలాపాలకు కరెన్సీ ముద్రించేటప్పుడు, అంతా ఆర్బీఐ చెప్పు చేతల్లో వుంటుంది. ఎంత ముద్రించాలి? దానిని ఎలా వ్యవస్థలోకి పంపించాలన్న నిర్ణయాల్ని ఆర్బీఐ తీసుకోగలుగుతుంది. కానీ ప్రభుత్వ ద్రవ్యలోటును పూడ్చడానికి డబ్బు ముద్రించాల్సి వస్తే, అది ఆర్బీఐ ద్రవ్య విధానం పరిధిలో వుండదు. ఎంత ముద్రించాలి? ఎప్పుడు ముద్రించాలనేది ప్రభుత్వ రుణ అవసరాలనుబట్టి వుంటుంది. దాంతో ద్రవ్య సరఫరాపై రిజర్వుబ్యాంక్ పట్టుకోల్పోతుంది. తద్వారా ఆర్బీఐ, ప్రభుత్వం పరపతి దెబ్బతిని, స్థూల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
- రుణ సమీకరణకు కొవిడ్ బాండ్లు జారీచేయోచ్చు. అయితే ఇలా సమీకరించే మొత్తం బడ్జెట్లో నిర్దేశించిన రుణ సమీకరణ లక్ష్యంలో భాగంగానే వుండాలి. అదనం కాకూడదు.
- సరైన వడ్డీ రేటుతో, తగిన కాలపరిమితితో జారీచేసే కొవిడ్ బాండ్లు… బ్యాంక్ డిపాజిట్ల ద్వారా ప్రస్తుతం కనిష్ఠ వడ్డీ రేట్లు పొందుతున్న పొదుపుదారులకు ఆకర్షణీయంగా వుంటాయి.
- ఇలా జారీ అయ్యే కొవిడ్ బాండ్లు వ్యవస్థలో ద్రవ్య సరఫరాను పెంచవు. దీంతో ఆర్బీఐ లిక్విడిటీ నిర్వహణకు ఎటువంటి అవరోధం వుండదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

