పని చేయని ఫుడ్ డెలివరీ యాప్‌లు… పలు నగరాల్లో జొమాటో, స్విగ్గీ డౌన్
న్యూఢిల్లీ: సాంకేతిక లోపం కారణంగా ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ డౌన్ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ యాప్‌లు పని చేయలేదు. అమేజాన్ వెబ్ సర్వీసెస్ ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేసే వెబ్సైట్లకు సాంకేతిక సమస్యలు వచ్చినట్లు సమాచారం. దీంతో జొమాటో, స్విగ్గీ వినియోగదారులు సుమారు అర గంట సేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫుడ్ ఆర్డర్లు బుక్ కాకపోవడంపై పలువురు ఆయా సంస్థల కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశారు.
కాగా, వెబ్సైట్ అంతరాయాలతోపాటు వినియోగదారుల ఫిర్యాదులను వివిధ మార్గాల నుంచి సేకరించడంతోపాటు ట్రాక్ చేసే డౌన్‌డెటెక్టర్ కూడా ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ డౌన్ గురించి పేర్కొంది. మధ్యాహ్నం 2.07 గంటలకు దేశంలోని పలు నగరాల్లో జొమాటోలో 3,030, స్విగ్గీలో 789 అంతరాయాలు నమోదైనట్లు వెల్లడించింది.
మరోవైపు సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ క్షమాపణ తెలిపాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు తమ బృందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నాయి. అయితే అంతరాయం ఏర్పడిన అర గంట తర్వాత ఈ రెండు ఫుడ్ డెలివరీ యాప్‌లు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

