Flipkart | 5 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్.. ఐఫోన్-13పై క్రేజీ ఆఫర్లు..?!
Flipkart | ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ తన కస్టమర్లకు మరో బిగ్ సేవింగ్ సేల్స్ డేస్ ప్రకటించింది. మే 5 నుంచి 10 మధ్య ఫోన్లు, టీవీలు, హోం అప్లియెన్సెస్ మీద భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.
Flipkart | ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్.. తన కస్టమర్ల కోసం మరోమారు బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ (Big Saving Days Sale)) తీసుకు వచ్చింది. మే నెల ఐదో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 10 వరకు ఈ ఆఫర్లు అమల్లో ఉంటాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ లో ఐ-ఫోన్ 13పై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ, రియల్ మీ సీ55, గూగుల్ పిక్సెల్ 6ఏ ఇతర ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నది.
ఆపిల్ ఐ-ఫోన్ 13పై ఎంత డిస్కౌంట్ ఇస్తామన్న సంగతి వెల్లడించలేదు గానీ గణనీయంగా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫ్లిప్ కార్ట్ ‘కర్టైన్ రేజర్ డీల్స్` మే ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు సాగుతుంది. ప్రస్తుతం ఐ-ఫోన్ 13 ధర రూ.61,999 కాగా, దానిపై 11 శాతం డిస్కౌంట్ అంటే రూ.7901 పొదుపు చేయొచ్చు. ఫ్లిప్ కార్ట్ రిటైల్ ప్రైస్ ప్రకారం రూ.69,900లకు లభిస్తుంది.
ఓల్డ్ స్మార్ట్ ఫోన్ బాగా ఉన్నట్లయితే రూ.29,250 ధర తగ్గుతుంది. వివిధ బ్యాంకు కార్డులపై కొనుగోళ్లు చేసిన వారికి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం, హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి రూ.2000 చొప్పున క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఇంకా పొకో సీ55 మోడల్ ఫోన్ ధర రూ.11,999 కాగా, రూ.7,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇన్ ఫినిక్స్ హాట్ 20 5జీ ఫోన్ ధర రూ.17,999 కాగా, రూ.9,999లకే అందుబాటులో ఉంటుంది. మోటో ఈ-13 ఫోన్ రూ.10,999 నుంచి రూ.7,499, రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ మోడల్ ధర రూ.29,999 కాగా, రూ.21,749లకే సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ 10 ప్రో+ ఫోన్ ధర రూ. 25,999.. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ లో రూ.22,999 లకే లభిస్తుంది. పోకో ఎక్స్ 5 ప్రో 5జీ ఫోన్ రూ.25,999 కాగా, రూ.5000 ఆఫర్ అందుబాటులో ఉంది.
ఇక గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్ రూ.43,999 నుంచి రూ.25,999లకు, పిక్సెల్ 7 ఫోన్ రూ.59,999 నుంచి రూ.44,999లకు తగ్గించారు. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్, శాంసంగ్ ఎస్21 ఎఫ్ఈ ఫోన్లపై డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది ఫ్లిప్ కార్ట్. వీటితోపాటు టీవీలు, హోం అప్లియెన్సెస్, లాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్ లు, హెడ్ ఫోన్లు తదితరాలపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయని వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

