Flipkart | డిసెంబర్ 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి సేల్ ప్రారంభం కానుండగా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి సేల్ ప్రారంభం కానుండగా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్ఫోనలపై బిగ్ డీల్స్ ఆఫర్ చేస్తుండటంతో హాట్ డివైజ్‌లను సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు వెసులుబాటు లభిస్తోంది. పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులపైనా ఆకర్షణీయ ఆఫర్లు, డీల్స్ లభించనున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆరు రోజుల పాటు కొనసాగుతూ డిసెంబర్ 21న ముగుస్తుంది. ప్లస్ మెంబర్షిప్ కలిగిన వారికి ఒక రోజు ముందుగానే సేల్ లైవ్‌లో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఐఫోన్ 13పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయనే వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. కంపెనీ ఇటీవల నిర్వహించిన బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 13పై రూ .4000 డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
గత పండుగ సీజన్లలో రన్ అయిన ఈవెంట్లలో మిస్ అయిన వారంతా తాజా సేల్ సందర్భంగా డిస్కౌంట్ ధరలో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. టీజర్ పేజ్‌లో రియల్మీ, యాపిల్, వివో, పోకో ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై డీల్స్ ఉన్నాయని వెల్లడించింది. ట్యాబ్లెట్స్, మానిటర్లు, ప్రింటర్లు సహా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. టీవీలు, గృహోపకరణాలపై 75 శాతం వరకూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది. ఇక హాట్ డీల్స్, ఆఫర్లకు సంబంధించి డిసెంబర్ 15న మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

