Flipkart Big Billion Days Sale 2024 | ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో పోకో ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు.. ఇవీ డిటెయిల్స్..!
Flipkart Big Billion Days Sale 2024 | ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకోకు చెందిన పలు ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Flipkart Big Billion Days Sale 2024 | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ తేదీలు వచ్చేశాయి. ఈ నెల 27 నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అవుతుంది. పాపులర్ స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది. ప్రత్యేకించి పోకో ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తోంది. పోకో ఎఫ్6 5జీ, పోకో ఎక్స్6 5జీ ఫోన్ల ధరలు తగ్గాయి. వీటితోపాటు అదనంగా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు లభిస్తాయి.
మ్యాడ్ రిటైల్ ప్రైస్ క్యాంపెయిన్ కింద ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో పలు ఫోన్ల ధరలు తగ్గించినట్లు పోకో తెలిపింది. ఎఫ్,ఎక్స్ఎం, సీ సిరీస్ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు అందిస్తున్నామని వెల్లడించింది. పోకో ఎఫ్6 5జీ ఫోన్ రూ.29,999 నుంచి రూ.21,999లకు, పోకో ఎక్స్ 6 ప్రో 5జీ ఫోన్ రూ.26,999 నుంచి రూ.18,999లకు తగ్గించేసింది.
అలాగే పోకో ఎక్స్6 5జీ ఫోన్ రూ.21,999 నుంచి రూ.14,999లకు, పోకో ఎక్స్6 నియో 5జీ ఫోన్ రూ.15,999 నుంచి రూ.11,999లకు లభిస్తుంది. పోకో ఎఫ్6 5జీ ఫోన్, ఇతర పోకో ఎక్స్ సిరీస్ ఫోన్లూ కూడా ఈ నెల 26 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో డిస్కౌంట్ ధరలకు లభిస్తాయి. పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ రూ.13,499 నుంచి రూ.10 వేలకు, పోకో ఎం6 5జీ ఫోన్ రూ.10,499 నుంచి రూ.7,4999లకు లభిస్తాయి. పోకో సీ65 ఫోన్ 9,499 నుంచి రూ.6,799, పోకో సీ61 ఫోన్ రూ.6,999 నుంచి రూ.6,299లకు లభిస్తాయి. ఈ నెల 27 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు సెప్టెంబర్ 26 నుంచి ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

