Festive Season | వంటింట్లో ధరల మంటలు.. దూసుకెళ్తున్న టొమాటో.. ఉల్లి
Festive Season | ఫెస్టివ్ సీజన్ ప్రారంభంతోనే ధరల మంట ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. టొమాటోలు, ఉల్లి ధరలు భగ్గుమన్నాయి.

Festive Season | ఇప్పుడంతా పండుగల సీజన్.. ఇంటికి కొడుకులు.. కూతుళ్ల కుటుంబాలు వస్తాయి. అందరికీ రుచికరమైన వంటకాలు చేసి పెట్టాలని ప్రతి తల్లికీ ఉంటుంది. కానీ ఇలా పండుగల సీజన్ ప్రారంభం అవుతుండగానే వంటింట్లో కీలకమైన టొమాటో, ఉల్లిగడ్డల ధరలు భగభగమంటూ పెరిగిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఉల్లి, టోమాటో తోటలు దెబ్బ తినడంతో దిగుబడి తగ్గడం కూడా దీనికి కారణం. పప్పు ధాన్యాలు, వంట నూనెల ధరలు దాదాపు గత నెల ధరలే కొనసాగుతున్నా.. ఉల్లి, టొమాటో ధరలు పెరిగిపోయాయి.

100 ప్రాంతాల్లో ఉల్లిగడ్డ ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా 100 ప్రాంతాలకు పైగా సగటున కిలో ఉల్లిగడ్డ ధర 39లకు పెరిగింది. గత నెలలో కిలో ఉల్లిగడ్డ ధర రూ.28 మాత్రమే. ఏడాది క్రితం ఢిల్లీ నగరాల్లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.46 పలికింది. ఆదివారం ముంబై, చెన్నై నగరాల్లో కిలో ఉల్లిగడ్డలు రూ.50-65 దాకా పలికాయి. \
ఇక టొమాటోలు కిలో సగటున రూ.45లకు దొరికాయి. గత నెలలో కిలో టొమాటో రూ.27 పలికితే గతేడాది సెప్టెంబర్‌లో రూ.41 దాకా దూసుకెళ్లింది. కోల్‌కతాలో ఆదివారం కిలో టొమాటో ధర రూ.93 పెట్టి కొనుగోలు చేయక తప్పలేదంటున్నారు వినియోగదారులు. ఇటీవల కురిసిన వర్షాలతో టొమాటో ధరలు మరింత పెరుగుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

గతేడాదితో పోలిస్తే వాటి ధరలు చౌకే
అయితే, గతేడాదితో పోలిస్తే ఉల్లిగడ్డ, టొమాటో, ఆలుగడ్డ ధరలు చౌకగా ఉన్నాయని కేంద్ర వినియోగ దారుల వ్యవహారాలశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, సెప్టెంబర్-నవంబర్ మధ్య ఉల్లిగడ్డ ధరలు పెరగడం సర్వ సాధారణమే. అయినా.. ప్రజలపై భారం పడకుండా ఈ నెల 12న ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, చండీగఢ్ నగరాల్లో 67,357 టన్నుల ఉల్లిగడ్డల నిల్వలను కేంద్రం విడుదల చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోని లోకల్ మార్కెట్లలో రూ.21లకే కిలో ఉల్లిగడ్డ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి :
Viral video: చూడ్డానికి ఆరేండ్ల బుడతడే.. కానీ పోలీసులతో ధైర్యంగా వాదన..!
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. అఖిల్ గట్టిగానే కొట్టాడబ్బా..
ఆశ్చర్యం..! మంచినీళ్లు కూడా లేకుండా 5 రోజులు జీవనం..!
Viral Video : ఇల్లునే తరలించారు.. బోట్ల సాయంతో నీటిలో ఇంటిని ఎలా తీసుకెళ్లారో చూడండి
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- onion
- tomatos
- Vegetables
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

