Auto Sales | 2022తో పోలిస్తే కార్ల సేల్స్ తక్కువే.. ‘ఫాడా’ ఏం చెప్పిందంటే..?!
Auto Sales | ఫెస్టివ్ సీజన్ జోష్‌తో అక్టోబర్ నెలలో కార్ల విక్రయాలు ఆల్ టైం రికార్డు నెలకొల్పాయని చెబుతున్నా.. 2022తో పోలిస్తే ఆటోమొబైల్ రిటైల్ సేల్స్ 7.73 శాతం తగ్గుముఖం పట్టాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తెలిపింది.
Auto Sales | ఫెస్టివ్ సీజన్ జోష్‌తో అక్టోబర్ నెలలో కార్ల విక్రయాలు ఆల్ టైం రికార్డు నెలకొల్పాయని చెబుతున్నా.. 2022తో పోలిస్తే ఆటోమొబైల్ రిటైల్ సేల్స్ 7.73 శాతం తగ్గుముఖం పట్టాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తెలిపింది. 2022 అక్టోబర్ నెలలో 22,95,099 వెహికల్స్ అమ్ముడైతే.. గత నెలలో 21,17,596 వాహనాలు మాత్రమే విక్రయించారని ఫాడా వెల్లడించింది. హిందూ క్యాలెండర్ ప్రకారం శుభ ముహూర్తాలు లేవని, అందుకే కొత్త వస్తువుల కొనుగోళ్లు జరుగలేదని చెబుతున్నారు.
2022 అక్టోబర్ లో 17,25,043 టూ వీలర్స్ విక్రయించగా, 15,07,756 యూనిట్లు మాత్రమే విక్రయించాయి ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు. 2022తో పోలిస్తే గత నెల టూ వీలర్స్ సేల్స్ 12.60 శాతం తగ్గుముఖం పట్టాయి. గత నెలలో కార్ల విక్రయాలు 1.35 శాతం పడిపోయాయి. 2022 అక్టోబర్‌లో 3,58,884 కార్లు అమ్ముడైతే గత నెలలో 3,53,990 యూనిట్లకే పరిమితం అయ్యాయి.
ఇదిలా ఉంటే త్రీ వీలర్స్ విక్రయాలు ట్రెండ్‌ను బ్రేక్ చేశాయి. 2022తో పోలిస్తే 45.63 శాతం త్రీ వీలర్స్ సేల్స్ పెరిగాయి. 2022లో 71,903 త్రీ వీలర్ వెహికల్స్ అమ్ముడైతే, గత నెలలో 1,04,711 యూనిట్లు అమ్ముడు పోయాయి.
కమర్షియల్ వెహికల్స్ సేల్స్ కూడా పుంజుకున్నాయి. 2022తో పోలిస్తే గత నెలలో 10.26 శాతం పెరిగాయి. 2022లో 80,446 వాణిజ్య వాహనాలు అమ్ముడైతే, గత నెలలో 88,699 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత నెల 14 వరకూ శ్రాద్ధ్ పీరియడ్ కారణంగా కొత్త వాహనాలు అమ్ముడు పోలేదని ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

