ఉద్యోగాలొస్తాయ్

ముంబై, సెప్టెంబర్ 3: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థికవేత్తలు.. ఓవరాల్‌గా ఈ ఆర్థిక సంవత్సరంలో లేబర్ మార్కెట్ కార్యకలాపాలు మెరుగ్గానే ఉంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ పరిస్థితుల ప్రభావం క్షీణిస్తున్న నేపథ్యంలో కంపెనీలు నియామకాలపై దృష్టి పెడుతున్నాయని చెప్తున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో), న్యూ పెన్షన్ స్కీంల పేరోల్ డాటా ఇందుకు అద్దం పడుతున్నాయని వారు గుర్తుచేస్తున్నారు. ‘ఆయా రంగాల్లోని సంస్థలు మళ్లీ ఉద్యోగులను తీసుకునే పనిలో పడుతున్నాయి. దీన్నిబట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లేబర్ మార్కెట్ కార్యకలాపాలు గతంతో పోల్చితే బాగుంటాయని మేము భావిస్తున్నాం’ అని ఎస్బీఐ ప్రధాన ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. అయితే ఆగస్టులో దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాల్లో 15 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారన్న సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనాల మధ్య ఎస్బీఐ ఆర్థికవేత్తల తాజా నివేదిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఒక్క గత నెలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షల మందికి ఉపాధి దూరమైనట్లు సీఎంఐఈ చెప్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- sbi
- soumya kanti ghosh
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

