Tax Deductions | పన్ను మినహాయింపు కావాలా.. పంచ మార్గాలివి!
Tax Deductions | మీరు రూ.1.5 లక్షల కంటే ఎక్కువ పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా.. ఈ ఐదు మార్గాలపై ఓ లుక్కేయండి..!
Tax Deduction | వేతన జీవి అయినా, వ్యాపారి అయినా.. ప్రతిఏటా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వేళ దగ్గర పడుతున్నా కొద్దీ పన్ను మినహాయింపుకు గల అవకాశాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. మెజారిటీ ఆదాయం పన్నుచట్టంలోని 80సీ సెక్షన్ కింద లభించే మినహాయింపులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారే తప్ప ఇతర సెక్షన్ల కింద ఆదాకు గల ఆప్షన్లను నిర్లక్ష్యం చేస్తారు. ఉదాహరణకు 80సీసీడీ (1బీ) సెక్షన్ కింద నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్), 80సీసీడీ (1బీ) సెక్షన్ కింద ఆరోగ్య బీమా ప్రీమియం, 24 సెక్షన్ కింద ఇండ్ల రుణాలపై మినహాయింపులు లభిస్తాయన్న సంగతి తెలియదు. 80డీ సెక్షన్ కింద ప్రతి ఒక్కరికి రూ.1.50 లక్షల వరకు పన్ను పొదుపు చేయొచ్చు. ఇది అవిభాజ్య హిందు కుటుంబ (హెచ్యూఎఫ్) సభ్యులు, వ్యక్తులకు మాత్రమే 80డీ సెక్షన్ వల్ల పన్ను ఆదా అవుతుంది. 80డీ సెక్షన్ మినహా మిగతా సెక్షన్ల కింద పన్ను ఆదా చేసే అవకాశాలను పరిశీలిద్దాం..
80సీసీడీ (1బీ) కింద ఎన్పీఎస్
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకం నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్). ఇందులో రూ.15 లక్షల పెట్టుబడి వరకు పెట్టుబడి పెట్టవచ్చు. త్రివిధ దళాల్లో (ఆర్మీ, వాయుసేన, నావికాదళం) పని చేసేవారిని ఈ సెక్షన్ నుంచి మినహాయించారు. ఉదాహరణకు ఎన్పీఎస్ కింద రూ.50 వేల వరకు పెట్టుబడి పెడితే పన్ను ఆదా చేయొచ్చు. ఇది 80సీ సెక్షన్ కింద లభించే మినహాయింపుకు అదనం. 80సీ సెక్షన్ కింద గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా ఆప్షన్ ఉంది. కనుక 80సీ, 80సీసీడీ (1బీ) సెక్షన్ల కింద కలిపి మొత్తం రూ.2 లక్షల ఆదాయం వరకు పన్ను పొదుపు చేయొచ్చు.
80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై ఇలా
తమకు ఎంతో ఇష్టమైన వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేకించి మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు మంచి ఆరోగ్య బీమా పథకం అవసరం. ఆరోగ్య బీమాలో పెట్టుబడులు పెట్టడానికి ప్రజల్ని కేంద్రం ప్రోత్సహిస్తుంది.. అందుకు పన్ను మినహాయింపులు ఇస్తుంది. ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు, ఆరోగ్య పరిరక్షణకు చేసిన చెల్లింపులపై పన్ను ఆదా చేయొచ్చు. అయితే 80డీ సెక్షన్ కింద ఆరోగ్య బీమా కవరేజీ పొందడానికి వారి వయస్సు కూడా కీలకం కానున్నది. కుటుంబ హోదాను బట్టి ప్రతి పన్ను చెల్లింపు దారు రూ.25 వేలు.. రూ.50వేలు, రూ.75 వేలు, రూ.లక్ష వరకు ఆరోగ్య బీమా కింద క్లయిమ్ చేయొచ్చు.
విద్యా రుణ వడ్డీ చెల్లింపుపై మినహాయింపు
ప్రతి తల్లిదండ్రులు తమ చిన్నారులు ఉన్నత చదువులు చదుకోవాలని.. ఉన్నతిలోకి రావాలని కోరుకుంటారు. కానీ ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యా కోర్సులు.. ప్రత్యేకించి విదేశాల్లో ఎంఎస్., పీజీ పట్టా కోసం భారీగా ఖర్చవుతుంది. దీనికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ విద్యారుణం తీసుకోవడం సర్వ సాధారణంగా మారింది. ఇలా పిల్లల ఉన్నత విద్యకు తీసుకున్న రుణం వడ్డీ చెల్లింపుపై 80ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద తీసుకునే రుణాలకు ఇది వర్తించదు. కేవలం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే విద్యా రుణాలకు మాత్రమే ఈ ఆప్షన్ వర్తిస్తుంది.
24 సెక్షన్ కింద రూ.2 లక్షల వరకు క్లయిమ్
పన్ను చెల్లింపుదారులు సొంతింటి కొనుగోలు కోసం తీసుకున్న హోంలోన్ వడ్డీ చెల్లింపుల పైనా పన్ను ఆదా కోసం క్లయిమ్ చేయొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 24 సెక్షన్ కింద వడ్డీ పేమెంట్పై పన్ను రాయితీ కోసం గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు క్లయిమ్ చేయొచ్చు. ఒకవేళ ఇంటి రుణంపై ఇల్లు కొనుగోలు చేసినా.. ఆ ఇంట్లో మీరు ఉండకున్నా.. అద్దెకు ఇచ్చినా.. అద్దెకివ్వాలని ప్లాన్ చేసుకున్నా పన్ను మినహాయింపునకు గరిష్ట పరిమితి లేదు. మొత్తం వడ్డీ చెల్లింపులపై పన్ను రాయితీ క్లయిమ్ చేయొచ్చు.
తొలిసారి ఇల్లు కొంటే 80ఈఈ సెక్షన్ కింద ఇలా
ఇంటి రుణంతో మీరు తొలిసారి ఇల్లు కొనుక్కున్నట్లయితే 80ఈఈ సెక్షన్ కింద మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. మీకు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే నాటికి మీ పేరుపై ఇల్లు గానీ, ఆస్తి కానీ ఉండరాదు. అప్పుడు 80ఈఈ సెక్షన్ కింద రూ.50 వేల వరకు రాయితీ క్లయిమ్ చేయొచ్చు. ఈ సెక్షన్ కింద పన్ను రాయితీ క్లయిమ్ చేయడానికి సదరు ఇంటి విలువ రూ.50 లక్షల్లోపు గానీ, రుణం రూ.5 లక్షలు అంత కంటే తక్కువ గానీ ఉండాలి.
పన్ను ఆదా మార్గాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
పన్ను చెల్లింపు దారులు తమకు ఆదాయం పన్ను మినహాయింపునకు ప్రభుత్వం కల్పించిన అవకాశాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పన్నుల ఆదా చేయడం ఎలాగో నిర్ణయించుకోవడం ముఖ్యమే. ఈ ఐదు మార్గాలు చాలా శక్తిమంతం.. అథంటిక్ కూడా. మీరు మీ పరిస్థితులను బట్టి పన్ను ఆదా అవకాశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

