ప్రతి ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే ఏ లక్ష్యాలనైనా సాధించవచ్చు. ఈ ఏడాదిలో కొత్త ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఈ ఐదు సూత్రాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వివేకంతో నిర్ణయాలు ఆర్థిక లక్ష్యాల సాధనకు తెలివైన నిర్ణయాలు అవసరం. అందుకే మీ సామర్థ్యానికి అనువైన నిర్ణయాలనే తీసుకోవాలి. అప్పుడే ఆత్మవిశ్వాసంతో విజయం దక్కుతుంది. పెట్టుబడులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులకు వెళ్లాలి.
ప్రస్తుత, సమీప భవిష్యత్తులో ఆదరణ ఉన్న రంగాలనే ఎంచుకోవడం ఉత్తమం. పోర్ట్‌ఫోలియోల పరిశీలన పెట్టుబడుల విషయంలో ఈ పోర్ట్‌ఫోలియోల ఎంపిక చాలా కీలకం. మీరు పెట్టే పెట్టుబడులు మీ పొదుపు, మీ అవసరాలను తీర్చేలా ఉండాలి. ఖర్చులు ఖర్చులపై ఎప్పుడూ నియంత్రణను కోల్పోకూడదు. అవసరమైన, అనవసరమైన వ్యయాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తిస్తే పొరపాట్లు జరగవు. రుణ చెల్లింపులు రుణ భారం ఎప్పటికీ మంచిది కాదు. వీలైనంత త్వరగా రుణ విముక్తులు కావడానికి ప్రయత్నించాలి. చిన్నచిన్న మొత్తాల్లోనైనా చెల్లింపులు జరుపడం లాభదాయకం.