Tina Ambani: ఈడీ విచారణకు హాజరైన టీనా అంబానీ
Tina Ambani: టీనా అంబానీ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫెమా కేసులో ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. ముంబైలో ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఆమె నుంచి ఈడీ వాంగ్మూలం తీసుకోనున్నది. అనిల్ అంబానీని కూడా సోమవారం ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ముంబై : వ్యాపారవేత్త అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ(Tina Ambani) ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. ఫెమా ఉల్లంఘన కేసులో ఆమె ఈడీ ముందు హాజరుకావాల్సి వచ్చింది. ఇదే కేసులో సోమవారం అనిల్ అంబానీ కూడా ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ఏరియాలో ఉన్న ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దాదాపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ విచారణ సాగడం గమనార్హం.
విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఆయనను ప్రశ్నించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టూ వారు పేర్కొన్నారు. అనిల్‌పై ఫెమా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు చెప్తున్నారు. కాగా, అనిల్ అంబానీతోపాటు ఆయన భార్య టినా అంబానీ ఈ వారంలో మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఈడీ సమన్లు జారీ చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

