ప్రపంచ కుబేరుడిగా మస్క్
ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఎలాన్ మస్క్ హవా కొనసాగుతున్నది. ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో 410 బిలియన్ డాలర్ల సంపదతో తన తొలి స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడితో విభేదాలు ఏర్పడినప్పటి నుంచి ఆయన సంపద భారీగా నష్టపోయినప్పటికీ తన తొలిస్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
- 410 బిలియన్ డాలర్ల సంపదతో తొలి స్థానం
- రెండో స్థానానికి ఎగబాకిన ఒరాకిల్ అధినేత ల్యారీ
- ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025 జాబితాలో వెల్లడి
న్యూయార్క్, జూన్ 14: ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఎలాన్ మస్క్ హవా కొనసాగుతున్నది. ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో 410 బిలియన్ డాలర్ల సంపదతో తన తొలి స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడితో విభేదాలు ఏర్పడినప్పటి నుంచి ఆయన సంపద భారీగా నష్టపోయినప్పటికీ తన తొలిస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మరోవైపు, గత కొన్నేండ్లుగా వరుస స్థానాల్లో కొనసాగిన అమెజాన్ అధినేత బెజోస్, మెటా చీఫ్ జెఫ్ బెజోస్లకు గట్టి షాక్ తగిలింది. ఒరాకిల్ అధినేత ల్యారీ ఎలిసన్ ఈసారికిగాను రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.
కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలకుమించి రాణించడంతో సంస్థ షేరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. దీంతో ఆయన సంపద 40 బిలియన్ డాలర్లు ఎగబాకి 258 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఒరాకిల్ షేరు గురువారం 13 శాతం ఎగబాకి 215 డాలర్లకు చేరుకున్నది. ఈవారంలోనే సంస్థ మార్కెట్ విలువ 40 బిలియన్ డాలర్లు ఎగబాకినట్టు అయింది. అలాగే మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్(238 బిలియన్ డాలర్లు), అమెజాన్ చైర్మన్ జెఫ్ బెజోస్(228 బిలియన్ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

