EV Scooters | ఏప్రిల్ నుంచి ఈవీ స్కూటర్లు పిరం.. కారణాలివే..!
EV Scooters | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విక్రయాలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ఫేమ్-2 స్కీమ్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈవీ స్కూటర్ల ధరలు 10 శాతం పెరుగవచ్చు.
EV Scooters | ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్ళుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్.. ఈవీ కార్లు, ఈవీ స్కూటర్ల విక్రయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తెచ్చిన ఫేమ్-2 స్కీమ్ ఈ నెలాఖరుతో ముగుస్తుంది. తాజాగా కేంద్రం ప్రకటించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీం -2024 (ఈపీఎంఎస్).. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఈ స్కీమ్ అమలుతో ఈవీ స్కూటర్ల ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయని ఇన్వెస్ట్ మెంట్ ఇన్ ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా (ఐసీఆర్ఏ) అంచనా వేసింది.
తాజాగా ప్రకటించిన ‘ఈపీఎంఎస్’ ప్రకారం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ఇస్తున్న సబ్సిడీ రూ.10 వేల నుంచి రూ.5,000లకు పడిపోయింది. గరిష్టంగా ప్రతి వాహనంపై సబ్సిడీ రూ.10 వేలకే పరిమితం అవుతుండటమే దీనికి కారణం అని ఐసీఆర్ఏ పేర్కొంది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ లు ప్రకటించింది. ఈ ఇన్సెంటివ్లతో టెస్లా వంటి కంపెనీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
పెరిగిన ధరల ప్రభావంతో తాత్కాలికంగా ఈవీ స్కూటర్ల క్రయ, విక్రయాలు తగ్గినా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6-8 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి ధరలు పెరుగనున్న నేపథ్యంలో వేతన జీవుల్లో తమ కుటుంబ బడ్జెట్ ఆధారంగా కొనుగోలు చేసే వారు ఈ నెలాఖరు లోపే ఈవీ స్కూటర్లు కొనుగోలు చేయడం బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

