న్యూఢిల్లీ, మే 6 : ప్రముఖ కార్ల సంస్థ హోండా తన మాడళ్లపై ప్రత్యేకంగా డిస్కౌంట్లో అందిస్తున్నది. ప్రస్తుత నెలలో మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద రూ.2.12 లక్షల వరకు రాయితీ ప్రకటించింది. ఈ ఆఫర్ అమేజ్, సిటీ మాడళ్లకు వర్తించనున్నదని పేర్కొంది. ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద నగదు డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు కల్పిస్తున్నది.
హోండా ఎలివేట్‌పై అత్యధికంగా రూ.2.12 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ కారు రూ.11.60 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. అలాగే హోండా సిటీపై రూ.1.56 లక్షల రాయితీ ఇస్తున్న సంస్థ..అమేజ్‌పై రూ.67 వేల ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది.