హైదరాబాద్, జనవరి 24: కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌ను అమర్చిన ఫిట్నెస్ వాచ్‌ను సిటీ యూనియన్ బ్యాంక్ విడుదల చేసింది. ‘కబ్ ఈజీ పే’ పేరుతో విడుదలైన ఈ రిస్ట్‌వాచ్‌ను పీఓఎస్ మెషీన్ ముందు చూపించడం ద్వారా చెల్లింపులు చేయవచ్చని, రూ. 5,000కు మించిన చెల్లింపులకైతే ఖాతాదారులు పిన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. వాచ్ ద్వారా జరిపే ప్రతీ లావాదేవీకి రిజిష్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. నెట్‌బ్యాంకింగ్/మొబైల్‌బ్యాంకింగ్ ద్వారా ఫిట్నెస్ వాచ్ డెబిట్ కార్డ్ కోసం ఖాతాదారులు రిక్వెస్ట్ పెట్టవచ్చని బ్యాంక్ వివరించింది. ఈ వాచ్ ద్వారా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయడంతో పాటు ఖాతాదారులు వారి ఆక్సిజన్ స్థాయిల్ని, టెంపరేచర్‌ను, హార్ట్‌రేట్‌ను, బీపీని చూసుకోవొచ్చని బ్యాంక్ పేర్కొంది.