క్రెడిట్ సూస్‌లో కొలువుల కోత : 9000 మంది ఉద్యోగులపై వేటు
స్విట్జర్లాండ్‌లో రెండో అతిపెద్ద బ్యాంక్ క్రెడిట్ సూస్ నాలుగో క్వార్టర్లో భారీ నష్టాలు తప్పవనే అంచనాల నేపధ్యంలో పెద్దసంఖ్యలో ఉద్యోగుల తొలగింపుపై సంకేతాలు పంపింది.
న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్‌లో రెండో అతిపెద్ద బ్యాంక్ క్రెడిట్ సూస్ నాలుగో క్వార్టర్లో భారీ నష్టాలు తప్పవనే అంచనాల నేపధ్యంలో పెద్దసంఖ్యలో ఉద్యోగుల తొలగింపుపై సంకేతాలు పంపింది. రాబోయే మూడేండ్లలో బ్యాంక్ పునర్వ్యవస్ధీకరణ ప్రక్రియలో భాగంగా 9,000 ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది.
క్యాపిటల్ మార్కెట్ల మందగమనంతో పాటు సేల్స్, ట్రైనింగ్ బిజినెస్‌ల్లో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. వెల్త్ మేనేజ్మెంట్, స్విస్ బ్యాంక్ విభాగాల్లో క్లయింట్ల కార్యకలాపాల్లోనూ స్ధబ్ధత నెలకొనడం బ్యాంక్ రాబడులపై పెను ప్రభావం చూపుతోంది.
మార్కెట్ పరిస్ధితుల కారణంగా వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగాల్లో నష్టాలు తప్పవని అంచనా వేస్తోంది. నాలుగో క్వార్టర్లో 2700 మంది ఉద్యోగులను తొలగించామని, 2025 నాటికి 9000 ఉద్యోగులను తొలగిస్తామని స్పష్టం చేసింది. వరుస కుంభకోణాలు వెలుగుచూసిన క్రమంలో బ్యాంకు పునర్వ్యవస్ధీకరణపై దృష్టిసారించామని క్రెడిట్ సూస్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

