అరువు ఓ దరువు..అప్పు ఓ ఊబి..
అత్యవసర సమయాల్లో చేబదులు ఓ అద్భుత అవకాశం. కానీ, దాన్ని తీర్చలేకపోతే మానవ సంబంధాలన్నీ మంటగలసి, పరువు పోయే పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఇదే సూత్రం క్రెడిట్ కార్డులకూ వర్తిస్తుంది. క్రెడిట్ కార్డులతో చేసిన ఖర్చును ఏ నెలకానెల తీర్చేస్తే అంతకు మించిన ఆయుధం మరొకటి ఉండదు. కనీస మొత్తాన్ని చెల్లిస్తూ చేసిన అప్పును రోలింగ్ చేస్తూ పోతే దాని మీద వడ్డీ, వడ్డీ మీద ఛార్జీలు అన్నీ కలిపి తడిసి మోపెడు అవుతాయి. క్రెడిట్ కార్డును కూడా సద్వినియోగం చేసుకుంటూ క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవచ్చునో తెలుసుకుందాం…

తీర్చగలిగిన మొత్తాన్నే అప్పు తీసుకోండి: క్రెడిట్ అప్పు కూడా నెల తిరిగిందా వడ్డీ పడుతుంది. అందుకే గడువులోగా తీర్చగలిగిన మొత్తాన్నే క్రెడిట్ కార్డుతో ఖర్చు చేయండి. గడువులోగా కనీస మొత్తాన్ని చెల్లించి మిగతా మొత్తాన్ని వదిలేసినా వడ్డీ, దాని మీద ఛార్జీలు, మళ్లీ నెల తిరిగే సరికే వడ్డీ కాస్త అసలుకు కలవడంతో ఇక ఎప్పటికీ మీరు ఆ అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది.
నగదు చేదు: క్రెడిట్ కార్డుతో నగదును విత్‌డ్రా చేయకండి. అలా చేసిన మరుక్షణం నుంచే వడ్డీ లెక్కిస్తారు. ఆ నగదును పూర్తిగా చెల్లించే వరకు వడ్డీ పడుతునే ఉంటుంది. దానికి తోడు 3.5 శాతం క్యాష్ అడ్వాన్స్ ఛార్జీలు అదనం.
నో కాస్ట్ ఈఎంఐలు: చాలా మర్చెంట్స్ పెద్ద కొనుగోళ్ళపై జీరో వడ్డీ ఈఎంఐ ఆఫర్లు ఇస్తుంటాయి. కొన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు వీటికి అదనంగా డిస్కౌంట్లు ఇస్తుంటాయి. ఇలాంటి కొనుగోళ్లతో చాలా వరకు ఆదా చేయవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Credit debt
- interest
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

