ఇంట్లో కూర్చునే శాఖను మార్చుకోవచ్చు
- ఆన్లైన్లో ఖాతా బదిలీ కస్టమర్లకు ఎస్బీఐ అవకాశం

ముంబై, మే 10: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ కస్టమర్లకు ఓ సదవకాశాన్నిచ్చింది. సేవింగ్స్ ఖాతాదారులు తమ శాఖను మార్చుకోవాలనుకుంటే ఇకపై బ్యాంక్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో ఈ పని చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎస్బీఐ ఈ మేరకు స్పష్టం చేసింది. యోనో ఎస్బీఐ, యోనో లైట్, ఆన్లైన్ ఎస్బీఐ వినియోగం ద్వారా ఖాతాను సులభంగా అందుబాటులోని మరో ఎస్బీఐ శాఖకు బదిలీ చేసుకోవచ్చని బ్యాంక్ ట్వీట్ చేసింది.
ఏం చేయాలంటే?
- onlinesbi.comలోకి లాగిన్ అవ్వండి
- పర్సనల్ బ్యాంకింగ్ను ఎంచుకోండి
- యూజర్ నేమ్, పాస్వర్డ్పై క్లిక్ చేయండి
- ఆ తర్వాత ఈ-సర్వీస్పై క్లిక్ చేయాలి
- సేవింగ్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్పై నొక్కండి
- మార్చాల్సిన మీ ఖాతా వివరాలివ్వాలి
- మారాలనుకుంటున్న శాఖ ఐఎఫ్ఎస్సీని పేర్కొనాలి
- మరొక్కసారి అన్నీ పరిశీలించి కన్ఫమ్ బటన్ను నొక్కాలి
- మీ ఖాతాతో లింకైన మొబైల్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫమ్ చేయాలి
- కొద్దిరోజుల తర్వాత మీ విజ్ఞప్తి మేరకు మీరు కోరుకున్న శాఖకు ఖాతా బదిలీ అవుతుంది చివరగా:.. మీ బ్యాంక్ ఖాతాతో మీ మొబైల్ నెంబర్ అనుసంధానమైతేనే, దానికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఈ మొత్తం ప్రక్రియ సజావుగా సాగుతుంది. లేనిపక్షంలో ఆన్లైన్లో శాఖ మార్పు కుదరదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- sbi
- sbi account
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

